ఈ పుట అచ్చుదిద్దబడ్డది
వేలాలంబకము
వేలకథ.
కం. వారణవక్త్రుని విఘ్నని
వారణసామ్రాజ్యమహితు వరసిద్ధిమహా
కారణభూతు నఘార్ణవ
తారణపారీణు మ్రొక్కెదన్ భక్తి మెయిన్.
ఇట్లు నరవాహనదత్తుఁడు శక్తియశతోను మదనమంచుకాది భార్యలతోను స్నేహితులతోను విహరించుచు కౌశాంబీనగరమునందు తండ్రిచెంత నుండెను. ఒకనాఁడు ఉద్యానవన గతుఁడైన నరవాహనదత్తునికడకు వైదేశికులు ఇద్దఱు అన్నదమ్ములు వచ్చి అతిథిసత్కారము పొంది తమ వృత్తాంతము నిట్లు నివేదించిరి. 'రాజేంద్రా, వైశాఖపురమును పాలించెడు రాజపుత్త్రులము, సవతికొడుకులము, నాపేరు రుచిరదేవుఁడు, ఈతండు పోతకుఁడు. జవశీల పిడియేనుఁ గొకటి నాకుఁగలదు, ఈతనికి వేగవంతములు రెండు గుఱ్ఱములు కలవు. తన్నిమిత్తము మాకిరువురకు వాదము సంప్రాప్తమయినది. నా పిడియేనుఁగువేగమే ఎక్కువ యని నావాదము. తన గుఱ్ఱముల