హేమప్రభా లక్ష్మీసేనుల కథ.
1221
కాలమునకు వరుసగా అతనికి లక్ష్మీసేనుఁడు, శూరసేనుఁడు, అని యిద్దఱు కొడుకులు పుట్టిరి. నన్ను వేఁటమెయి నిచ్చటికి వచ్చిన లక్ష్మీసేనునిఁగా నెఱుంగుము.' అని చెప్పెను. హేమప్రభయు తనవృత్తాంతము నాతనికిం జెప్పి జాతి స్మరణము కలదై యాతనితో మరల నిట్లు పల్కెను. 'మహాత్మా, నీదర్శనము వలన నాకు జాతిస్మరణ మయినది. నేను విద్యాధరిని శాపచ్యుతనై నీలోకమునఁ బుట్టితిని. ఈమెయు నాసఖియ, నీవు నీమంత్రియు క్రమముగా నాకును నాసఖికిని పతులరు, శాపచ్యుతులరు, విద్యాధరులరు. సఖీసహితకు నాకు శాపము ఇప్పుడు క్షీణించినది. మన కందఱకు విద్యాధరలోకమునందు మరల సమాగమము.' ఇట్లు చెప్పి హేమప్రభ చెలితోడ దివ్యరూప థారిణి యై యాకాశమార్గంబున తనలోకమునకుఁ బోయెను.
అంతట లక్ష్మీసేనుఁడు నివ్వెఱపడి చూచుచుండ నాతని మంత్రియు నచ్చోటికి వచ్చెను. లక్ష్మీసేనుఁడు మంత్రితో నాస్త్రీలవృత్తాంతమును వచించుచుండ, బుద్ధిప్రభుఁడును కుమారిని వెదకుచు నాస్థలమున కేతెంచెను. అతఁడు కూఁతుం గానక రాజుపుత్త్రుం జూచి కొమారిత వృత్తాంతము నడుగ, రాజపుత్త్రుఁ డా వృత్తాంతమును తాఁ జూచినంతయుఁ జెప్పెను. బుద్ధిప్రభుఁడు దుఃఖించుచుండ, లక్ష్మీసేనుఁడు శాపావసాన మగుటంజేసి జాతి స్మరణము కలవాఁడై మంత్రితో విద్యాధర లోకమునకుఁ బో