Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1032

కథాసరిత్సాగరము. లం. 10. త. 1.

నీ సర్వస్వము ఇత్తువేని, ఈ నగర మెల్ల నిత్తువేనియు, దీని నీయ సాధ్యపడదు, కోట్లసంగతి తలఁప నేల?' అని దృఢముగ పలికెను. సుందరియు 'నా సర్వధనమును ఇచ్చెదను. కోఁతిని" నా కిమ్ము. అమ్మకు నాపై కోపము వచ్చిన రానిమ్ము.' అని ఈశ్వరవర్మపాదములు పట్టుకొనెను. అర్థదత్తాది మిత్త్రులు 'ఇమ్ము, ఏ మయిన నగును గాక' అనిరి.

అంత నీశ్వరవర్మ కోఁతిని ఇయ్య నంగీకరించినవాఁడై, హృష్టురా లయిన సుందరితో ఆదినమును గడపి, తెల్లవాఱఁ గానే మరల సుందరి నిర్బంధింపఁగా ఆమర్కటముచే ముందుగా రెండువేల దీనారములను మ్రింగించి, దానిని సుందరికి ఇచ్చి, దానివెలగా సుందరియొక్క సర్వస్వమును కైకొని తత్క్షణమే వాణిజ్యముకై స్వర్ణద్వీపమునకు పోయెను. సుందరి సంతుష్ట యై యాచింపఁగా ఆలము రెండుదినములు వేయేసి దీనారములు ఇచ్చెను. మూఁడవనాఁడు ఎన్నిమాఱులు అడిగినను ఆలము ఏమియు ఇయ్య కుండుడు, సుందరి దానిని పిడికిట గ్రుద్దెను. కోఁతి తన్నుకొట్టుచున్న సుందరీ మకరకటుల ముఖములను కోపమున ఎగిరి దంతములతోను గోళ్లతోను గీఱి గాయములు చేసెను. అంత ముసలిది మోమున రక్తధార లొలుకుచుండ దుడ్డుఁగఱ్ఱలతో ఆలమును కొట్టెను. ఆ దెబ్బలకు ఆలము చచ్చెను. అది చచ్చుటయు సర్వధనము పోవుటయు తలఁచి దుఃఖిత యై సుందరియు తల్లితోఁగూడ ప్రాణత్యాగమునకు