Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమప్రభా లక్ష్మీసేనుల కథ.

1219

'పట్టీ, రాజలక్ష్మిని విడిచి అరణ్యవాసము నేల కైకొంటివి, దీని విడిచి విూయమ్మకడకు రమ్ము.' అని పిలిచెను. రాజకన్య తండ్రితో 'నాయనా, దైవము నన్నిట్లు చేసెను. నేనేమియుం జేయఁజాలను, వనవాస సుఖమును వదలి పట్టణవాసము నొల్లను.' అనెను. తండ్రి ఎంత చెప్పినను కూఁతు రంగీకరింపదాయెను. అంత నారాజు కూఁతునకు అడవిలో నివాసభవనము నొకటి కట్టించి అతిథిపూజ నిమిత్తము వలయువస్తువుల నెల్ల పనుపు చుండెను. హేమప్రభయు తండ్రి పనుపువస్తువులతో నతిథుల తృప్తులఁజేయుచు తాను ఫలాహారమే యొనర్చు చుండెను.

ఇట్లు కాలము గడుపుచున్న యాహేమప్రభయాశ్రమమునకు కుమార బ్రహ్మచారిణి యొక పరివ్రాజిక యేతెంచెను. హేమప్రభసత్కరించి ప్రవ్రజ్యాకారణ మడుగఁగా, పరివ్రాజిక తనవృత్తాంతము నిట్లు నుడివెను. 'నేను కన్యకగా నాతండ్రి యింట నుండఁగా ఆయన నన్ను కాళ్లొత్తు మనెను. నేను పాదము లొత్తుచు తూఁగాడఁగా, నిద్రించెదవా యని ఆయన నన్ను తన్నెను. ఆకారణమున నేను కోపించి యాతనియిల్లు విడిచి యీసన్న్యాసాశ్రమముం బూనితిని.' అని చెప్పెను. ఈకథను విని రాజపుత్త్రి ఆమెను తనతో సమానశీలనుగా నెఱింగి, వనవాససఖినిగా గ్రహించెను.

ఒకనాఁడు ప్రవ్రాజికతో రాజకన్య 'సఖీ, కడచిన రాత్రి కలలో విశాలమైన నదిని దాఁటి తెల్లకొండనెక్కి భగవం