1216
కథాసరిత్సాగరము. లం. 10. త. 10.
సంపద గల్గునో దానిం జేసెద.' ఇట్లు చింతించి గంభీరమైన వర్తక వేషముం బూని ఱేని మొగసాలకుం జని ప్రతీహారనివేదితుఁడై లోపలికిఁ బ్రవేశించి కానుక యొసంగి, ఏకాంతమున నొకమనవి యున్న దని రాజుతో జెప్పెను. అతనివేషముచేతను కానుకచేతను భ్రాంతుఁడై రాజు ఏకాంతభాషణము నంగీకరింపఁగా నాధూర్తుఁడు రాజుతో 'దేవా, ప్రతిదినము కొలువుఁగూటంబున నందఱయెదుట క్షణకాలము నాతో నీవు మాట లాఁడ గోరెదను. అందులకై దినమునకు ఏనూఱు పైఁడిటంకములను కానుక యొసంగెదను.' అని విన్నవించెను. రాజు కొంతతడవు తలపోసి 'ప్రతిదినము ఏనూఱు పైఁడిటంకములు ఉపాయన మిచ్చు వర్తకశ్రేష్ఠునితో మాటలాడుటవలన నేమి కొదువ? యని యందులకు సమ్మతించెను. నాటంగోలె నాధూర్తుఁడు రాజునకు కానుకల నొసంగుచుండెను. లోకము అతని ముఖ్య సచివునిఁగాఁదలంచెను. ఇట్లు కొంతకాలము గడవ; నొకనాఁడు సభలో నొకయధికారిమోమును చూచి ధూర్తుఁడు సాకూతముగా రాజుతో మాటలాడు చుండెను. కొంతసేపటికి ధూర్తుఁడు వెలువడ ఆయధికారి వానిని 'నావిషయమై నీవు రాజుతోఁ జేసిన ప్రస్తావ మేమి? అని యడిగెను. 'నీవు ఱేని దేశము నపహరింప గోరితి వని అతఁడు కుపితుఁడై యున్నాఁడు. అందుకై నీమోముం జూచితిని. నేను ఈకోపమును శాంతిఁబొందించెను.' అని చెప్పెను. ఆవంచకుని యామాటలు విని