1212
కథాసరిత్సాగరము. లం. 10. త. 10.
యక్షుఁ డంగీకరించి మఱియొక వరము కోరు మనెను. సన్న్యాసి 'ఇది మొదలు నన్ను మీరు పుత్త్రునిగాఁ నంగీకరింప నాకోరిక.' అన నాయక్షదంపతులు ప్రత్యక్షమై, ఆలాగే యగుఁగాక యని చెప్పి 'పుత్త్రుఁడా, మాయనుగ్రహమునం జేసి ఆపదలం బొందవు. జగడములోను, జూదములోను వాదమునందును జయశీలుఁడవు అగుదువు.' అని వర మిచ్చి యంతర్హితు లైరి. పరివ్రాజకుఁడు యక్షునికి నమస్కరించి యావృక్షమూలంబున నారాత్రిఁ గడపి మఱునాఁడు తఱువాత పాటలీపుత్త్రముఁ జేరి, అచ్చట రాజాస్థానమునకుం జని ప్రతీహారనివేదితుఁడై రాజు సమీపంబునకుం బోయి యచ్చటిపండితులను వాదమున యక్షప్రసాదముచే జయించి మరల రాజునెదుట పండితులను 'చిత్రభిత్తినుండి చక్రగదాధరుం డైన పురుషుఁడు వెలువడి నన్ను నఖదంతక్షతయుక్తం గావించి మరల గోడలో లయించుచున్నాఁడు. పండితులారా, దీనివివరముం జెప్పుఁడు.' అని యాక్షేపించెను. ఆపండితులు పరమార్థము నెఱుంగక మొగమొగంబులు సూచి యూరకుండిరి. అంత నారాజు 'నీ వడిగిన ప్రశ్నమునకు ఉత్తరము నీవే చెప్పుము' అని యతి నడిగెను. యతి రాజభార్యయొక్క కపటచరిత్రము నంతయుం జెప్పెను. రాజు స్త్రీసంగమును దూరి తనరాజ్యము నంతయు నొసంగెదను గ్రహింపు మని యతి నడిగెను. యతి స్వదేశ వాసాభిలాషచే రాజ్యము కైకొన కుండఁగా, రాజు రత్న రాశిచే