Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆలజాల కథ.

1031

యతనిని సమిత్త్రుని కంఠాశ్లేషాది సంభ్రమ విభ్రమములతో సంతోష పెట్టెను. దానికి స్నేహము చూపి యీశ్వరవర్మ అప్పుడే అర్థదత్తుని పంపి ఆలమును తెప్పించి 'ఓరి ఆలపుత్త్రా, ఇప్పుడు, మున్నూఱు దీనారములు భోజనపానములకు ఇమ్ము, తాంబూలాదికమునకై నూఱు దీనారములు ఇమ్ము, అమ్మకు మకరకటికి నూఱు దీనారములు ఇమ్ము, బ్రాహ్మణులకు నూఱు ఇమ్ము, సహస్రములో మిగిలి యుండుదానిని సుందరికి ఇమ్ము.' అని యాజ్ఞాపించెను. ముందుగ వేయి దీనారములు మ్రింగి యున్న యా మర్కటము ఆప్రకారమే దీనారములను క్రక్కి క్రక్కి వ్యయసమయములయం దిచ్చుచుండెను. ఈప్రకారము ఒకపక్ష కాలము ప్రతిదినము ఈశ్వరవర్మ వ్యయమునకై జోఁతిచే దీనారములు ఇప్పించెను. ఇంతలో మకరకటియు సుందరియు ఆలోచించిరి. 'అహొ ! చింతామణి కోఁతిరూపమున సిద్ధించి యున్నది. దినమునకు ఇది సహస్రదీనారములు ఇచ్చును. దీనిని ఇతఁడు మన కిచ్చిన ఇఁక కోరవలసిన దేమియు సుండదు.' ఇట్లు ఏకాంతమున తల్లితోఁగూడి ఆలోచించుకొని సుందరి ఈశ్వరవర్త్మను భోజనానంతరము సుఖముగా నున్నప్పుడు 'నాయందు నీకు స్నేహము నిజమేని, ఈ యాలమును నాకిమ్ము.' అని యడిగెను. ఈశ్వరవర్మ యనియె: 'ఇది మా తండ్రియొక్క సర్వధనము, దీనిని ఇయ్య వలనుపడదు.' 'మీ యైదు కోట్లను ఇచ్చెదను, దీనిని ఇమ్ము.' అని సుందరి పలికెను. ఈశ్వరవర్మ