1208
కథాసరిత్సాగరము. లం. 10. త. 10.
యొకఁ డుండెను. అతఁ డొకనాఁడు 'సర్వత్ర జయ మొందెదను గాక' యని శివునికి ప్రదక్షిణము చేసి విద్యావాదము నిమిత్తము పాటలీపుత్త్రమునకు తరలెను. దారిలో అడవులు, ఏళ్లు, కొండలు నతిక్రమించి కాఱడవిలో చెట్టునీడ విశ్రమించెను.
ఇంతలో వాపీశీతల మైన యా నీడకు దూరమార్గ శ్రాంతుఁడు దండకమండలుహస్తుఁడు ఒకధార్మికుఁడు వచ్చెను. యతీంద్రుఁ డాతనిం జూచి, 'ఎందుండి యెచ్చటికిం బోయెద ర'ని యడుగ ధార్మికుఁడు 'మిత్త్రుఁడా, నేను విద్యా క్షేత్ర మైన పాటలీపుత్త్రమునుండి కశ్మీరదేశమునకు విద్యావాదమున నచ్చటివారిని జయించుటకై పోవుచున్నాను.' అని చెప్పెను. అంత నాపరివ్రాజకుండు 'పాటలీపుత్త్రవాసి నీతని నొక్కని జయింపఁ జాలనేని అనేకుల నెట్లు జయింపఁ జాలుదు' నని తలంచి ధార్మికునితో 'థార్మికుఁడా నీకృత్యము చాల విరుద్ధము. మోక్షార్థివి నీ వెక్కడ? వ్యసనాశ్రయ మివాద మెక్కడ? వాదపణముచే సంసారమును తరింపఁ గోరెదవు, అగ్ని చే వేఁడిని, మంచుచే శీతమును అడంపఁ గోరెదవు, పాషాణనావచే సముద్రమును దాఁటఁగోరెదవు, మండుచున్న నిప్పును గాలిచే నార్పఁ గోరెదవు. బ్రాహ్మణులకు క్షమయు, క్షత్త్రియులకు ఆపన్నరక్షయు, ముముక్షువులకు శమనము, రాక్షసులకు కలహమును, శీలములు. కాఁబట్టి సంసారక్లేశభీరు లై సుఖదుఃఖమును విసర్జించిన ముముక్షువులు శమదమములు గలిగియుండ