విద్యాభిమానియతి కథ.
1207
తమును తండ్రికిం దెలిపెను. గౌరిచే స్వప్నబోధితుఁడై యా రాజు విద్యాధరేంద్రుని రావించి పూజించి మృగాంకలేఖ నాతని కొసంగెను. అమృతతేజసుఁడు అవ్వధూమణిం బరిగ్రహించి వజ్రకూటమునకుఁ బోయెను. అచ్చట మర్త్యత్వము నందు తనకు జనకుండైన కనకాక్షుని సభార్యుఁ డై పూజించి సర్వసుఖముల ననుభవించు చుండెను. కావున పూర్వకర్మ విహిత శుభాశుభంబులను జనులు అనుభవించుచుండుదురు. ఇట్లు గోముఖునిచెప్పిన కథను విని శక్తియశయందు ఉత్సుకుఁడైన నరవాహనదత్తుఁడు నిద్రాసుఖ మనుభవించెను.
10-వ తరంగము.
విద్యాభిమాని యతి కథ.
మఱుసటిరాత్రి వినోదార్థము గోముఖుఁడు నరవాహనదత్తునితో నిట్లు చెప్పసాగెను. థారేశ్వర మను శైవసిద్ధక్షేత్రమునందు అనేక శిష్యోపాసితుఁడు ఒకమహర్షి యుండెను. అతఁడొకనాఁడు 'మీలో నెవ్వరేని యేదే నపూర్వమును చూచి యున్నను వినియున్నను నివేదింపుఁడు.' అని శిష్యుల నడిగెను. వారిలో నొకఁడు 'నే నొకయపూర్వమును వింటిని, దానిం జెప్పెద.' నని యారంభించెను. కశ్మీరదేశములో విజయ మని శైవమహాక్షేత్రము ఒకటి కలదు. అందు విద్యాభిమాని యతి