1206
కథాసరిత్సాగరము. లం. 10. త. 9.
మృగాంకలేఖకును గౌరి 'హిరణ్యాక్షుని పెండ్లి యాడుదువు. ఏల దుఃఖించెదవు? అతఁడు విద్యాధరుఁడు. శాపవశంబున నరజన్మము పొందినాఁడు, తాపసికేలు సోఁకినంత నతనికి నరజన్మము తొలంగును.' అని స్వప్నమున చెప్పెను. ఆమెయు మేల్కాంచి స్వప్న వృత్తాంతమును తాపసి కెఱిఁగించెను. ఆ సిద్ధురాలు భూలోకమునకుఁ బోయి యమరేశ్వరుని చెంత హిరణ్యాక్షునింజూచి 'పుత్త్రా, విద్యాధరలోకమునకు రమ్ము.' అని యాతని ప్రణతుని తోడ్కొని నింగిం బోయెను.
అప్పుడు హిరణ్యాక్షుఁడు శాపము తీఱి పూర్వజాతిని స్మరించి యామెతో, తాపసీ, నేను హిమాద్రియందు వజ్రకూటపురమున అమృతతేజసుఁ డను పేరి విద్యాధర రాజను. నేను ఒకమునిని తిరస్కరించి యాయనశాపమువలన మర్త్యుఁడనుగాఁ బుట్టితిని, అదియు నీకేలుసోఁకువఱకే. తిట్టుఁబడిన నా వియోగముచే శరీరముం దొఱంగిన నా పూర్వభార్యయే ఈమృగాంకలేఖ. ఇప్పుడు నీతోఁ జని దానిం జేపట్టెదను.' అని వాక్రుచ్చి తాపసితోఁగూడ హిమాలయంబునకుం బోయెను. నగరోద్యానమందే మృగాంకలేఖను హిరణ్యాక్షుఁడును హిరణ్యాక్షుని ఆమెయును జూచిరి. ఇరువురును ఒకరొకరి శ్రుతిమార్గమున మానసముం జొచ్చి దృష్టిమార్గమునుండి వెడలిరి. 'నీ వీతని వివాహ మాడుదు వని నీతండ్రికిఁ దెలుపు' మని తాపసి చెప్ప నాకన్యయు లజ్జావనతవదనయై సఖీముఖమున నావృత్తాం