Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొలను త్రవ్వించిన మూఢుఁడు.

1201

మార్జారమును వెదకసాగిరి. ఆమూఢులను బరిహసింపనివారు లేరు. మూఢులు ఎవ్వరి పరిహాసమునకు పాత్రులు గారు!

కొలను త్రవ్వించిన మూఢుఁడు.

ఒకమఠమున పలువురు మూఢులతో మూఢశిఖామణి యొకఁడు ఉండెను. ఒకనాఁడు అతఁడు చెఱువు త్రవ్వించిన వానికి పరలోకమునందు అనంతఫల మని పురాణము విని వచ్చి, తనధన మెల్ల వ్యయించి మఠముచెంత నొక కొలను ద్రవ్వించెను. ఒకనాఁ డతఁడు కొలనిం జూచుకొనఁ బోయినప్పుడు కొల నొకప్రక్కపగిలియుండెను. ఎవ రట్లు చేసిరో యని చింతిల్లుచు వాఁడు మఱునాఁడు పోయి చూచుకోఁగా మఱియొక్క గట్టు పగిలి యుండెను. అంత నాతఁడు 'ఱేపటినుండి వేకువ మొదలు సాయంకాలము ధనుక ఇచ్చటనే యుండెద, దీని నిట్లు పగులఁగొట్టువానిం గనుగొనెద?' అని నిశ్చయించుకొని యా మఱునాఁడు వఱువాత చెఱువుగట్టు చేరెను. ఎద్దొకటి కొలని దరులను కొమ్ములతో కోరాడుచుండెను. దానిం గని అది కైలాసమునుండి వచ్చిన హరవృషభ మని యెంచి దానితో స్వర్గమునకు పోఁగోరి, యాతడు దానితోఁకను బట్టుకొనెను. నందియు వానిని తనతావునకు కైలాసమునకుఁ గొనిపోయెను. అచ్చట మూఢశిఖామణి మిక్కిలి శ్రేష్ఠము లైన భక్ష్యభోజ్యములం దినుచుఁ గొంతకాలము సుఖం బుండెను. వృషభము ప్రతిదినము భూలోకమునకు పోయి వచ్చు చుండెను, ఒక