బోధిసత్త్వాంశభవుని కథ.
1191
మహాసత్త్వా, నీవు నన్నుద్ధరించితివి. నేను పోయెదను. నీకెప్పుడయిన నాపద గలిగిన నన్ను తలంచుకొనుము. వచ్చి నీకు ఉపకారము చేసి నేను శాపమోక్షము పొందెదను. -
ఇట్లు పలికి సింహము పోఁగా బోధిసత్త్వుఁ డడుగఁగా సువర్ణచూడము తనవృత్తాంతము చెప్పసాగెను. - హిమాచలములో విద్యాధరాధీశుఁడు వజ్రదంష్ట్రుఁడు కలఁడు. అతనికి దేవియందు వరుసగా ఐదుగురు కన్యలు పుట్టిరి. అంత నతఁడు శివునిఁగూర్చి తపస్సు చేసి రజతదంష్ట్రుఁ డను కొమరుని ప్రాణాధికిప్రియుని పొందెను. వాఁడు బాల్యముననే స్నేహముచే తండ్రిచేత దత్తవిద్యుఁ డై బంధునేత్రోత్సవముగా వర్ధిల్లుచుండెను. ఒకనాఁడు రజతదంష్ట్రుఁడు తనజ్యేష్ఠసోదరి గౌరి యెదుట పింజరక మను వాద్యమును వాయించు చుండఁగా చూచి 'నాచేతికిమ్ము, పింజరకమును నేను వాయించెదను.' అని బాల్యచాపలముచేత నిర్బంధముగా అడిగెను. ఆమె ఈయలేదు. అంత నతఁడు చాపలముచే స్వయముగా ఆమెచేతినుండి ఒడిసి కైకొని పక్షివలె మింటి కెగసెను. అంత నామె 'నాచేతిపింజరకమును హఠమున హరించి ఎగిరితివి గాన నీవు స్వర్ణచూడపక్షి వౌదువు.' అని శపించెను. రజతదంష్ట్రుఁడు ఆమెపాదములఁ బడి వేఁడుకోఁగా కరుణించి 'మూఢ, నీవు పక్షివై చీఁకటినూతిలో పడుదువు, అప్పుడు కరుణాపరుఁ డొకండు నిన్ను ఉద్ధరించును. అతనికి ఉపకారముచేసి శాపాంతము పొందుదువు.' అని యాపె