ఆలజాల కథ.
1029
ధనమెల్ల మకరకటి సులువుగా హరించినది!' ఇట్లని ఆతఁడు తన కుమారుని వృత్తాంత మంతయు వివరించెను. అంత నా వృద్ధకుట్టని యిట్లనియె: 'పుత్త్రు నిచటికి పిలిపింపుము. మకరకటియొక్క సర్వధనమును అతఁడు హరించునట్లు చేసెదను' అంత రత్నవర్మ కుమారుని తోడ్కొని రమ్మని మరల మంచి మాటలతో ధనముతో హితైషిని అర్థదత్తునిఁ బంపెను. అర్థదత్తుఁడు కాంచనపురమునకుఁ బోయి సర్వ వృత్తాంతమును ఈశ్వరవర్మతో చెప్పి ఇట్లనియె: — 'మిత్త్రా, నా మాట విన వయితివి. వేశ్యాసద్భావమును ఇప్పటికి ప్రత్యక్షముగా కంటివి గదా. అయిదుకోట్ల ధనమునకు ఒక యర్ధచంద్రమును పొందినాఁడవు. వేశ్యలయందును ఇసుకయందును ప్రాజ్ఞుఁడు విశ్వాస ముంచునా? నిన్నననేల, వస్తుధర్మ మిట్టిదే. రామావిభ్రమ భూములయందు పడకున్నంత సేపే పురుషుఁడు విదగ్ధుఁడు, వీరుఁడు, భాగ్యవంతుఁడును. తండ్రియొద్దకు వచ్చి కోపశాంతి చేయుము' ఇట్లు బోధించి అర్థదత్తుఁడు వానిని త్వరగా తండ్రియొద్దకు కొని వచ్చెను. ఈశ్వరవర్మ దుఃఖాక్రాంతుఁడై తన యపరాధమును క్షమింపు మని తండ్రిపాదములలో వ్రాలెను. తండ్రియు ఏకపుత్త్ర, స్నేహముచేత వానిని ఓదార్చి యమజిహ్వకడకు తోడ్కొని పోయెను
అది యడుగఁగా ఈశ్వరవర్మ అర్థదత్తముఖమున తన ధననాశవృత్తాంతమును సుందరి కూపములో పడుట తుదిగా