బోధిసత్త్వాంశభవుని కథ.
1187
వెంటనే బోధిసత్త్వాంశసంభవు నా వణిక్పుత్త్రుని ప్రకృతులు నగరిలోనికి కొనిపోయి రాజునుగా అభిషేకము చేసిరి. అతఁడు రాజ్యము పొంది కరుణాక్షాంతులతో క్రీడించు చుండెనే గాని చపలమతు లగు స్త్రీలను గూడ లేదు.
అతనిభార్యయో అతఁడు నదిలో చచ్చె నని తలఁచి, నిశ్శంకముగా ఆజారుని వీపుమీఁద నెక్కించుకొని, తిరుగుచు 'నేను పతివ్రతను, నాపతి నితనిని వైరులు కాలుసేతులు కొట్టినారు. ఇతనిని భిక్ష మెత్తి రక్షించుచున్నాను, నాకు భిక్ష.ము పెట్టుఁడు.' అని గ్రామగ్రామమునను నగరనగరమునను బిచ్చమెత్తుచు క్రమక్రమముగా తనపతి యేలుచున్న యా నగరమునకు వచ్చెను. అచటను ఎప్పటియట్లు బిచ్చ మెత్తుచు పౌరులచే పతివ్రత యని పూజలు పొందుచు క్రమముగా అతనిచెవిని పడినది. అంత నతఁడు దానిని పిలిపించెను. అదియును వీఁపున మొండెమును మోచుకొని వచ్చెను. రాజు దానిని 'నీవా ఆపతివ్రతవు ?' అని యడిగెను. అదియు రాజశ్రీతేజస్సుచే పరివృతుఁ డైనయాతని తనభర్తనుగా నెఱుంగ నేరక 'దేవా, నేనే ఆపతివ్రతను.' అని పలికెను. రాజు నవ్వుచు నిట్లనియె: 'నీపాతివ్రత్యమును నేనుఫలముచే తెలిసికొంటిని. చేతులు చక్క నున్న భర్త స్వరక్తమాంసములతో పోషించినను అతనిని స్వీకరింప శక్యవు కాని మానుషరాక్షసివి! సర్వదా నారక్త మాంసములు హరించియు వికలునికి ఈ మొండెమునకు స్వా