Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1184

కథాసరిత్సాగరము. లం. 10. త. 9.

పరానందభూమి యగు సమాధియందు సిద్ధిఁబొంది క్రమముగా తమస్సును నాశముచేసి మోక్షము పొందిరి. వారి యా దుష్ట స్త్రీలు నిజపాపపరిణామ మైన కష్టదశలను అనుభవించి త్వరలో నష్ట లై లోకద్వయభ్రష్ట లై పోయిరి. ఈ ప్రకారము స్త్రీల యందు మోహప్రభవ మైనరాగము ఎవరికి దుఖఃమును కలిగింపదు! వారివిషయ మై వివేకము వహించినవారికి వైరాగ్యము మోక్షము నొసంగును. శక్తియశకై ఉవ్విళ్లూరుచున్న నరవాహన దత్తుఁడు ఇట్లు గోముఖుఁడు చెప్పిన కథవలన వినోదము పొంది రాత్రి మెల్లగా సుఖనిద్రం జెందెను.


9-వ తరంగము.


బోధిసత్త్వాంశభవుని కథ.

మఱుసటిరాత్రి గోముఖుఁడు నరవాహనదత్తుని వినోదపఱుచువాఁ డై ఈకథ చెప్పెను: - ఒక నగరములో బోధిసత్త్వాంశసంభవుఁడు ఒక గొప్ప వర్తకుని కొమరుఁడు మాతృహీనుఁడు ఉండెను. తండ్రి మరల పెండ్లియాడి రెండవ భార్య మాటలు విని ఈకుమారుని ఇంటినుండి తఱుమఁగా ఇతఁడు భార్యతోఁగూడ వనవాసమునకుఁ బోయెను. తనతమ్ముఁడును, తన్నుంబోలె తండ్రి తఱుముడు, తనతోఁ గూడ వచ్చుచుండఁగా అశాంతచిత్తు నతని విడిచి తాను వేఱుమార్గమునఁ