ఘట కర్పరుల కథ.
1173
బోయెను. ఇట్లు లోకవర్తనమున ప్రజ్ఞయే ప్రధానసాధనము. ధనదరిద్రుఁడు జీవించును గాని బుద్ధిదరిద్రుఁడు జీవింపనేరఁడు.
ఘట కర్పరుల కథ.
ఈ యద్భుతకథను వినుము. ఘటుఁడు కర్పరుఁడు నని ఒకనగరములో ఇద్దఱు దొంగ లుండిరి. వారిలో ఒకరాత్రి కర్పరుఁడు ఘటుని వీథిలో ఉంచి రాజసుతయొక్క పడుకగదిలోనికి కన్నము త్రవ్వి ప్రవేశించెను. వాఁడు మూలలో దాఁగియుండఁగా రాజకన్య మేల్కొని కామాతుర యై వానిని పిలిచెను. ఆమె వానితో క్రీడించి వానికి ధన మిచ్చి మరల వత్తువేని ఇంక ధన మిచ్చెద నని చెప్పెను. అంత కర్పరుఁడు వెలువడి ఘటునిచేతికి ఆధన మిచ్చి ఇంటికి పంపి తాను మరల అంతః పురము సొచ్చెను. కామలోభాకృష్టుఁడు అపాయమును కన నేర్చునా? మరల రాజపుత్త్రితోఁ గలసి సురతశ్రాంతుఁ డై పానమత్తుఁ డై ఆమెతో నిద్రించెను. తెల్లవాఱినను మేలుకొన లేదు. తెల్లవాఱఁగానే అంతఃపురరక్షకులు వచ్చి అట్లున్న కర్పరుని కొని పోయి రాజునెదుటఁ బెట్టిరి. రాజు కోపముచే వానిని ఉరికి ఆజ్ఞ చేసెను. వధ్యభూమికి తలవరులు కొనిపోవుచుండ వీనితోడుదొంగ ఘటుఁడు వీఁడు రాత్రి యింటికి రానందున వీనిని వెదకుకొని వచ్చెను. వానిం గని కర్పరకుఁడు 'రాజ సుతను కొనిపోయి కాపాడుము.' అని సంజ్ఞ చేసెను. ఘటుఁడు అంగీకరించెను. సంజ్ఞచే తలవరులు కర్పరకుని చెట్టున ఉరిఁ