Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రాహ్మణనకులము.

1169

దత్త యని భార్యయు నుండిరి. ఆమె గర్భిణియై యథాకాలము పుత్త్రునిఁ గనియెను. ద్విజుఁడు దరిద్రుఁ డయ్యును ఆ సుతునిఁ గని పెన్నిధిఁ గన్నట్లు సంతోషించెను. పురుడు తీఱినతర్వాత భార్య స్నానార్థము నదికిఁ బోయెను. దేవశర్మ ఇంట సుతుని చూచుకొను చుండెను. ఇంతలోపల రాజాంతఃపురమునుండి చేటి వచ్చి స్వస్తివాచనముకొఱకు రమ్మని అతనిని పిలిచెను. అతఁడు శిశురక్షణార్థము ఇంట ఆబాల్య వర్ధిత మైన ముంగిసను ఉంచి దక్షిణార్థము రాజాంతఃపురమునకుఁ బోయెను. అతఁడు పోఁగా ఆకస్మికముగా శిశువుకడకు పాము రాఁగా నకులము దానిని స్వామిభక్తిచే చంపెను. ఇంతలో దేవశర్మ ఇంటికి రాఁగా నకులము పామునెత్తుటఁ దోఁగుచు సంతోషముతో అతని కెదురుపోయెను. అతఁడు ఆరూపున నున్న యాముంగిసను గని అది నిశ్చయముగా తన కుమారుని చంపిన దని తలఁచి రాతితోఁ గొట్టి చంపెను. లోనికి పోయి చూడఁగా బాలుఁడు నవ్వుచు ఆడుకొను చుండెను. చెంత పాము తుండెము లై పడియుండెను. కని బ్రాహ్మణుఁడు పశ్చాత్తాపదుఃఖితుఁ డాయెను. భార్య వచ్చి 'ఇట్లు ఏమియు విచారింపక మహోపకారిని నకులమును చంపితి వేమి?' అని యతనిని ఆక్షేపించెను. కావున బుద్ధిమంతుఁడు అవిచారితముగా ఏమియు చేయఁ గూడదు. అట్లు చేయువాఁడు ఇహపరములకుఁ గాక చెడును.