Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1158

కథాసరిత్సాగరము. లం. 10. త. 7.

ర్పింప వలయును. అందువలన నేను పూర్ణవ్రతఫల మైన దివ్యత్వమును పొందుదును.' అని తెలిపెను. వారును నమ్రులై అంగీకరింపఁగా యక్షుఁడు చెట్టెక్కి యంతర్ధానము పొందెను. ఆభ్రాత లీరీతిని అప్రయాససిద్దార్థు లై రాత్రి గడపి తెల్లవాఱఁగానే బయలు వెడలి స్వగృహము చేరిరి. అచట తమ వృత్తాంతము చెప్పి తల్లిదండ్రులను సంతోషపెట్టి యక్షుని కొఱకు ఉపోషణవ్రత మాచరించిరి. అంత గురువు యక్షుఁడు విమానమున వచ్చి వారితో 'మీదయచే యక్షత్వము తొలఁగి దేవత నైతిని. మీరు ఇఁక నీవ్రతమును మీక్షేమముకొఱకు చేసికొనుఁడు. ఇందువలన మీకు దేహాంతమున దేవత్వము కలుగును. నా వరముచే మీకు అక్షయధనము కలుగును.' అని చెప్పి ఆ కామగమనుఁడు విమానమున స్వర్గమునకుఁ బోయెను. యశోధర లక్ష్మీధరులును ఆవ్రతము చేసి విధ్యాధన సమృద్ధులై సుఖ ముండిరి. ఇట్లు కష్టములయం దైనను సదాచారము వదలని ధర్మపరులను దేవతలు రక్షించి యిష్టార్థము లొసంగుదురు.

ఇట్లు వసంతకుఁడు చెప్పిన యాయద్భుతకథను విని వత్సరాజసుతుఁడు శక్తియశఃప్రాప్త్యుత్కంఠను కొంతవఱకు సహించి యుండెను. భోజనకాలమున తండ్రి పిలువ నంపఁగా నరవాహనదత్తుఁడు తనమంత్రులతోఁ గూడ తండ్రియొద్దకుఁ, బోయెను. అచట అనురూపముగా భుజించి, సాయంకాలమున తన వయస్యులతోఁగూడి తన నగరికి వచ్చెను. అచ్చట నతనిని