1156
కథాసరిత్సాగరము. లం. 10. త. 7.
ఇట్లతఁడు తన వృత్తాంతమును చెప్పి యన్నదమ్ముల నిరువురను ఇష్టమృష్టాన్నములతో పూజించి సత్కరించెను. అంత నతనిభార్య పతివ్రత పూర్వవృత్తాంతము స్మరించి నేల మోఁకాళ్లపై నిలిచి చంద్రుని చూచుచు నిట్లు పలికెను. 'ఓ లోకపాలకులారా, సత్యముగా నేను పతివ్రతనేని, నాపతి యితఁడు జలవాసజన్మము మాని స్వర్గమునకు పోవునుగాక.' ఇట్లు ఆమె పలుకఁగానే ఆకాశమున విమానము వచ్చెను. దాని నెక్కి ఆదంపతులు స్వర్గమునకుఁ బోయిరి. పతివ్రతలకు ఈ మూఁడు లోకములలోను అసాధ్య మే మున్నది!
దానిం గని విప్రకుమారులు ఆశ్చర్యపడి రాత్రి అక్కడనే గడపి తెల్లవాఱఁగా బయలు వెడలిరి. సాయంకాలమునకు నిర్జనారణ్యములో నొకచెట్టు గని జల మెచట నయినం గలదా యని వెదకు చుండఁగా చెట్టునుండి యొకశబ్దము వినఁబడెను. 'ఓ బ్రాహ్మణులారా, ఉండుఁడు, నే నిప్పుడ మీకు స్నానాన్న పానములతో ఆతిథ్యము చేసెదను. మీరిపుడు నాయింటికి వచ్చితిరిగదా.' ఇట్లని ఆవాక్కు విరమించెను. అంతట అచట జలపూర్ణ మయిన యొకబావి పుట్టెను. దానిగట్టున విచిత్ర మైన పానభోజనములును ఉద్భవించెను. 'ఏమి యిది!' అని యాశ్చర్య పడుచు ఆబ్రాహ్మణ కుమారులు బావిలో స్నానముచేసి యథేచ్ఛముగా భోజన మారగించిరి. పిమ్మట సంధ్యావందనము చేసినారు చెట్టుక్రింద వచ్చి కూర్చుండఁగా, చెట్టునుండి సుందరుఁ