ముసలిపామును కప్పలును.
1141
భక్షింతును? మీకు వాహన మగుదును.' అని పాము నుడివెను. కప్పరాజు వాహనోత్సుకుఁడై సచివసమేతుఁడై నీటినుండి నిర్భయముగా వెలువడి వచ్చి పామువీఁపుపై సంతోషముతో స్వారి చేసెను. ఆతనిని మంత్రిసమేతముగా కొంతసేపు మోసీ బడలి పాము ‘దేవా, ఆహారము లేమిచే నిఁక నేను తిరుగఁజాలకున్నాను, కావున నాను ఆహారము పెట్టుము; జీతము లేక భృత్యుఁడు ఎట్లు పని చేయును? అనెను. ఆమాట విని భేకరాజు వాహనప్రియుఁడు 'నాపరిజనములలో కొందఱను భక్షింపుము.' అనెను. అంతట పాము క్రమముగా స్వేచ్ఛముగా కప్పలను కాఁజేసివేసెను. భేకపతియు వాహనాభిమానాంధతచే అందులకు సహించి యుండెను. కడపట పాము భేకరాజును కూడ భక్షించెను.
ఈరీతిగా ప్రాజ్ఞుఁడు మధ్యలో ప్రవేశించి మూర్ఖుని వంచించును. నేను నిట్లేప్రవేశించి ఆమూర్ఖుని నాశము చేసితిని. కనుక రాజు నీతివేత్త గావలయును. మూర్ఖుని యథేచ్ఛముగా భృత్యులు భక్షింతురు, శత్రువులు నాశనము చేయుదురు, సిరి ద్యూతలీలవలె వ్యాజసమన్విత, నీటియలవలె చంచల, సురవలె మైకము కలుగఁజేయునది. ఆమె ధీరుఁడును మంచి మంత్రాంగము కలవాఁడును వ్యసనవిహీనుఁడును విశేషజ్ఞుఁడును అగు రాజునొద్ద త్రాటఁ గట్టఁబడినదియుం బోలె నిలుకడగా నుండును. నీవు బుద్ధిమంతుఁడవు, విద్వద్వచనముప్రకారము