ఎలుకపిల్లయు మునియు.
1139
మార్చి ఆయెలుకకు ఇచ్చి వేసెను. ఇట్లు ఎంతదూరము పోయినను ఎవఁడు ఎట్టివాఁడో వాఁడు అట్టివాఁడుగానే యుండును, కనుక చిరజీవీ, నీవును ఎన్నఁటికిని గ్రుడ్లగూబవు కానేరవు.
రక్తాక్షుని యామాట విని చిరజీవి, 'నీతిజ్ఞుఁ డయిన యితనిమాటను ఈ రాజు పాటి చేయ లేదు. కడమ వీ రెల్ల మూర్ఖులే, కనుక నాకార్యము సిద్ధమే.' అని తలపోయుచుండఁగా, దానిని తోడ్కొని రక్తాక్షవాక్యమును లక్ష్యపెట్టక బలగర్వితుఁడు ఉలూకరాజు తనతావుకుఁ బోయెను. చిరజీవియు అవమర్దునికి పార్శ్వస్థుఁ డయి అతఁడు పెట్టిన మాంసాది భోజనములచే త్వరలో ఱెక్కలు చక్కఁగా మొలచి బలిసి నెమలివలె నాయెను.
ఒకనాఁడు చిరజీవి ఉలూకరాజుతో 'దేవా, నేను పోయి కాకరాజును ఓదార్చి తనచోటికి తెచ్చెదను, తరువాత రాత్రి మీరు పోయి అతనిని కొట్టి వేసి రావచ్చును. నేనును నీప్రసాదమునకు అనృణుఁడ నయ్యెదను. మీరు గడ్డి మొదలగు సాధనములచేత ద్వారమును గప్పి గూండ్లలో పగలు అతఁడు వచ్చి మీఁద పడకుండ రక్షితు లై సుఖముగా నుండుఁడు.' అని బోధించి, గ్రుడ్లగూబల గుహాద్వారమును తృణపర్ణాదికములచే కప్పించి, తన దొరకడకుఁ బోయి, అతనిం దోడ్కొని తానును ఇతర కాకములును మండుచున్న కొఱవులు తల కొకటి నోటఁ గఱచుకొని, ఆగుహయొద్దకు వచ్చి, దివాంధము లయిన యా