Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1138

కథాసరిత్సాగరము. లం. 10. త. 6.

ఎలుకపిల్లయు మునియు.

ఒకముని డేగకాళ్లనుండి పడిన యెలుకపిల్లను కృపచే తపోబలముచే మనుష్యకన్యగా చేసి ఆశ్రమములో పెంచెను. ఆపిల్లకు యౌవనమురాఁగానే ముని దానిని బలవంతుని కియ్యఁగోరి సూర్యుని పిలిచి 'నేను ఈకన్యను బలవంతుని కీఁదలంచితిని. నీవు దీనిని వివాహమాడుము' అనెను. సూర్యుఁడు 'నాకన్న మేఘుఁడు బలవంతుఁడు, అతఁడు నన్ను క్షణములో కమ్మును.' అనెను. ఆయుత్తరము విని ముని సూర్యుని పొమ్మని మేఘుని పిలిచి అట్లే పిల్లను వివాహ మాడు మనెను. మేఘుఁడును అట్లే 'నాకన్న వాయువు బలవంతుఁడు, నన్ను దిక్కులకు విసరివేయును.' అనెను. అంతట ముని వాయువును పిలిచి అడిగెను. అతఁడును అట్లే 'అయ్యా, నాకన్న బల్లిదములు కొండలు, నేను వానిని కదలింపలేను.' అనెను. విని మునిసత్తముఁడు ఒక కొండలరాయని పిలిచి పిల్లను పెండ్లిచేసి కొమ్మనఁగా, 'అయ్యా, నాకన్నను ఎలుకలు బలవంతములు, అవి నాదేహ మెల్ల రంధ్రములు చేయుచున్నవి' అని కొండ చెప్పెను. ఇట్లు క్రమముగా జ్ఞానప్రభావముగల యా దేవతలచే ఉత్తరము పొంది యాముని అడవినుండి ఒకయెలుకను పిలిచి ఆపిల్లను పెండ్లిచేసికొ మ్మనఁగా 'ఈకన్య నా కలుగులో ఎట్లు ప్రవేశించును?' అని యెలుక యడిగెను. 'మునుపటివలె ఇది ఎలుకయే యగునుగాక ' అని ముని దానిని మరల ఎలుకనుగా