1134
కథాసరిత్సాగరము. లం. 10. త. 6.
గతు లై యుండఁగా ఇల్లు సొచ్చెను. వానిం గని భయముచే ఆతరుణి మరలి పతిని కౌగిలించుకొనెను. ఆ యభ్యుదయమునకు ఆశ్చర్యపడి వృద్ధు వణిజుఁడు కారణ మరియుచు దిక్కులు చూడఁగా ఒకమూల చోరుఁ డగపడెను. 'నీవు నాకు ఉపకారివి, కనుక నాభృత్యులచే నిన్నుఁ గొట్టింపను.' అని పలికి వణిజుఁడు చోరుని పంపివేసెను. ఈప్రకారము మనకు ఉపకారి గావున ఈచిరజీవి రక్షణీయుఁడు.
ఇట్లు పలికి దీప్తనయనుఁడు విరమింపఁగా ఉలూకరాజు మఱియొకమంత్రిని వక్రనాసుని కర్తవ్యము చెప్పు మని యడిగెను. అతఁ డిట్లనియె. - ఇతఁడు మనకు రక్షణీయుఁడు. ఇతఁడు పరమర్మజ్ఞుఁడు. ఈమంత్రికిని ఇతనిస్వామికిని కలిగిన వైరము వలన మనకు శ్రేయస్సు కలుగును. నిదర్శనము వినుము.—
చోరరాక్షసులు.
ఒకద్విజుఁడు రెండుగోవులను దానము పుచ్చుకొని తెచ్చి కట్టివేసికొనెను. వాని నపహరింప దొంగ యొకఁడు కోరెను. ఆసమయమందే రాక్షసుఁ డొకఁడు ఆబ్రాహ్మణుని భక్షింపఁ గోరెను. అందులకై రాత్రి ఆబ్రాహ్మణుని యింటికి పోవుచు చోరరాక్షసులు దారిలో కలసికొని ఒకరియుద్దేశ్యము నొకరికి చెప్పికొనిరి. అచట దొంగ 'నేను ముందుగా గోవులను హరించెదను. ముందు నీవు పట్టుకొందువేని ఈబ్రాహ్మణుఁడు మేలు