Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఘము జయించును.

1131

ఒక్కమాఱుగానే చంపివేసెను. ఇట్లు క్షుద్రుఁ డగు దుర్జాతి యందు విశ్వాస ముంపఁగూడదు, కనుక అతిదుర్జాతి యగు నీయులూకమును రాజును చేయఁదగదు.

వాయసము చేసిన యీ బోధనవలన పక్షు లన్నియు ఉలూకమున కభిషేకము మానినవి. 'ఇది మొదలు మీరును మేమును అన్యోన్యశత్రువులము సుమా, మఱచిపోకుము.' అని ఉలూకము కోపముతో కాకిని బెదరించి వెడలిపోయెను. కాకి 'అయుక్తము పలికితిని గదా' అని దుఃఖిత మాయెను. మాట మాత్రముననే కలిగినవైరమునకు ఎవరు అనుతాపము పొందరు! ఈరీతిని మనపై గ్రుడ్లగూబలకు వైరము వాక్పారుష్యము వలనఁ గలిగినది. కాక రాజుతో ఇట్లు చెప్పి చిరజీవి మరల పలికెను. ఉలూకములు అనేకములు, బలసమన్వితములు, వానిని జయించుట మన కసాధ్యము;

సంఘమి జయించును.

పలువురును ఎప్పుడును జయింతురు. నిదర్శనము వినుము. ఒక బ్రాహ్మణుఁడు ఒకమేఁకను కొని బుజముమీద పెట్టుకొని గ్రామమునుండి తన నగరమునకు పోవు చుండెను. దారిలో ధూర్తు లనేకులు దానిని చూచి భక్షింపఁ గోరి, ఒకఁడు త్వరత్వరగా అతనికడకు వచ్చి 'అయ్యా బ్రాహ్మణా, ఏమి ! భుజముమీఁద కుక్కను మోచుచున్నావు ! క్రింద పాఱవేయవయ్యా!' అనెను. ఆ మాట విని లక్ష్య పెట్టక బ్రాహ్మణుఁడు పోవుచుండఁ