Jump to content

పుట:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1128

కథాసరిత్సాగరము. లం. 10. త. 6.

వచ్చి ఆపక్షులను 'ఓమూర్ఖులారా, హంసకోకిలాది పక్షులు లేవా? క్రూరదృష్టిని అమంగళదర్శనుని పాపుని ఈయులూకుని అభిషేకము చేసెద రేమి ? ప్రభావవంతుని రాజును చేసికోవలయును ; అతఁడు తన పేరివలననే మనకు సిద్ధి కలుగువాఁడుగా నుండవలయును.

వ్యపదేశమువలన సిద్ది.

చంద్రసరస్సని మహాజలము గొప్ప చెఱు వొక చోట నుండెను. దానితీరమున శిలీముఖుఁ డని శశకరాజు ఒకఁడు ఉండెను. వఱపుచే కడమ జలాశయము లెల్ల ఎండిపోఁగా ఇది మాత్రము జలసమృద్ధముగానే యుండెను. ఇచటికి ఏనుఁగుల మందతో యూథపతి చతుర్దంత మనునది జలపానార్థము వచ్చెను. ఆయూథము జలము దఱియు నలజడిచే శిలీముఖుని స్వజనములు శశము లనేకములు చదిసి చచ్చినవి. గజపతి మరలి పోయినపిమ్మట శశరాజు శిలీముఖుఁడు దుఃఖితుఁ డై ఇతరశశములు గూడ విను చుండఁగా 'విజయ మను శశముతో నిట్లనియె:— 'ఈయేనుఁగు ఇచట నీటిరుచి కన్నది. ఇఁక మరల మరల ఇచటికి వచ్చుచునే యుండును, మనలను నిశ్శేషముచేసి వేయును. నీవు దానియొద్దకు పోయి ఏ దయిన నుపాయము చేయుము, నీవు మిగుల నుపాయ శాలివి, నీవు పోయిన కార్యమెల్ల శుభముగా నెఱవేఱినది. ' ఇట్లు రాజు పంపఁగా కుందేలు తరలి పోయెను. మార్గానుసారముగా ఆ యేనుఁగును కని,