1124
కథాసరిత్సాగరము. లం. 10. త. 5.
అంతట నపుంసకప్రాయుఁ డాభటుఁడు 'ప్రభూ, నీ మంగలవానిని నాకిచ్చి వేయుము' అని యడిగెను. ఎల్లవారును వారి సత్త్వమునకు తగినట్లు ఫలము వేఁడుదురు.
నకించిన్మార్గణుఁడు.
నకించిన్మార్గణుని వినుము. ఒక మూర్ఖుఁడు దారిని పోవుచుండఁగా బండివాఁ డొకఁడు వానిని తనబండి కొంచెము సరిగా పెట్టి పొమ్మని యడిగెను. అందులకు నాకేమి యిచ్చెద వని మూర్ఖుఁ డడిగెను. '(నకించిత్ దదామి) ఏమియు ఇయ్యను (నకించిత్ ఇచ్చెదను)' అని బండియాసామి చెప్పెను. అంత మూర్ఖుఁడు బండిని చక్కఁగా నిలిపి బండివానిని 'ఇయ్యవోయి నాకు నకించిత్ ' అని యడిగెను. అతఁడు పరిహసింపసాగెను. దేవా, ఈరీతిగా మూర్ఖులు జనులచే పరిహాసమును పొంది నింద్యు లయి ఆపదల పా లగుదురు. యోగ్యు లెప్పుడును పూజనీయులుగా నుందురు.
ఇట్లు నరవాహనదత్తుఁడు రాత్రి గోముఖునివలన ఇట్టి వినోదకథలను విని జగత్త్రయ విశ్రాంతి హేతు వైన నిద్రా సుఖమును భజించెను.