చండాల కన్య.
1111
సుఖార్థ మై పోయెను. ఇట్లుండఁగా పతి దేశాంతరమునుండి వచ్చెను. వానితో పూర్వశిక్షితురా లయిన యా దాసి బాష్ప గద్గద స్వరముతో 'అయ్యా, నీభార్య కాలధర్మము నొందినది, దహనము కూడ అయి పోయినది.' అని, వానిని శ్మశానమునకు కొనిపోయి ఒకపొదలోని యెముకలు, చూపించెను. వాఁడు వెంటనే భార్యకు ఉదకక్రియలు చేసి, అస్థులను తీర్థములో వేసి వచ్చి, భార్యకు శ్రాద్ధము చేయ నారంభించెను. ఆ దాసియే సద్బ్రాహ్మణుఁ డని భార్యోపపతినే తేఁగా, వానినే మూడుఁడు శ్రాద్ధ బ్రాహ్మణునిఁగా నియంత్రించెను. ఆ యుపపతితోడ ప్రతిమాసికమునందును భార్యకూడ ఉదారవేషాభరణ యై వచ్చి భోజనము చేసి పోవుచుండినది. 'ఓప్రభూ, చూడు నీభార్య పాతివ్రత్యప్రభావముచే పరలోకమునుండి ప్రత్యక్షముగా వచ్చి బ్రాహ్మణునితో కూడ భోజనము చేయుచున్నది!' అని దాసి చెప్పెను. ఆ మూర్ఖశిరోమణి ఆ మాటను యథార్థముగా నమ్మి ఆనందించెను. ఈ ప్రకారము కుస్త్రీలచే ఋజుబుద్ధులు వంచితు లగుదురు
చండాలకన్య.
చండాలకన్య కథను వినుము. రూపవంతురాలు ముగ్ధచండాలకన్యక యొకతె సార్వభౌముని వరునిఁగాఁ బడయ సంకల్పించుకొని యుండెను. ఒకనాఁడు రాజు ఊరేఁగుచుండఁగా కని సర్వోత్తము నతని భర్తృబుద్ధిచే వెంబడించెను. ఇంతలో