సూర్యప్రభుని పత్నుల సల్లాపములు.
805
రాంగములచేతను, రంజింతురు. ఒకతె బంగారువలె పచ్చనిదై, ఒకతె ప్రియంగువువలె శ్యామలవర్ణయై. మఱియొకతె ఎఱుపు తెలుపు కలిసినవర్ణముగల దై అగపడినమాత్రాన దృష్టులను ఆకర్షించును. ఒకతె బాల్యములో అందముగా నుండును. ఒకతె నిండుజవ్వనమున నేత్రోత్సవ మగును. ఒకా నొకతె విభ్రమహారిణి యై ప్రౌఢతనమున మనము, హరించును. ఒకతె నవ్వుచు శోభించును ఒకతె కోపగించుచు రమణీయ యగును. ఒకతె ఏనుఁగువలె, మఱియొకతె హంసవలె, నడచుచు ప్రీతి యొసంగుదురు. పలుకుచు నొకతె శ్రుతుల నమృతముంబోలె వర్షించును. బొమవిలాసముతో చూచుచు నొకతె రాజిల్లును. స్వాభావికస్థితిలోనే ఒకతె శోభిల్లును. నృత్తముచేత ఒకతె, గీతముచేత మఱి ఒకతె, వీణాదివాదన విజ్ఞానముచేత నొకతెయు, ఆహ్లాదము నొసంగుదురు. బాహ్యరతాభిజ్ఞ యొకతె, అభ్యంతర రతప్రియ యొకతె, అలంకారప్రియ యొకతె, నేర్పుచే వెలుఁగొందు నొకతె, భర్తృచిత్తగ్రహణాభిజ్ఞయై ఒకతె సౌభాగ్యము నొందును. ఎంత యని చెప్పుదును? ఇంక ఇతరస్త్రీలగుణములు పెక్కులు నానావిధములు. ఇట్లు ఒక్కొక్క వరాంగనకు ఒక్కొక్కగుణ ముండును. మూఁడులోకములలోను ఎవతెకును ఎల్లగుణములు ఉండవు. కనుక నానారసాస్వాదనపరాయణులై ప్రభువులు అపహరించి యైనను క్రొత్తక్రొత్త భార్యలను సదా తెచ్చుకొని సంభోగించు చుందురు. ఉత్తములు ఎప్పుడును