800
కథాసరిత్సాగరము. లం. 8. త. 4
సంఘర్ష జాతానలతటిల్లతము కాఁగా శస్త్రక్షతగజాశ్వౌధురక్త థా రావపూరితము లై నీరకాయ మహాగ్రహము లై శోణిత మహానదులు వెల్లిగొను చుండెను. రక్తములో నర్తించుచు ఈఁదుచు శబ్దించుచు ఉన్న శూరఫేరన భూతములకు ఆరణము మహోత్సవముగా నుండెను. లెక్క లేనిసైనికులు చచ్చి, దొమ్మి యుద్ధము శాంతించి, స్వపరసైన్యవిభాగము అగపడ నారంభింపఁగా యుద్ధము చేయుచున్న ప్రతిపక్షప్రవీరుల నామములను సుమేరువు సూర్యప్రభాదులకు చెప్పెను. అంతట మొదట సుబాహురాజునకును అట్టహాసుఁ డనువిద్యాధరపతికిని ద్వంద్వ యుద్ధ మారంభ మాయెను, చాలాసేపు పోరి అట్టహాసుఁడు సుబాహువుశిరమును అర్ధచంద్రబాణముచే తెగవైచెను. సుబాహువు పడఁగా ముష్టికుఁడు కోపముతో ఎదుర్కొని అట్టహాసునిచే హృదయమందు బాణహతుఁ డై ధర వ్రాలెను. ముష్టికుఁడు చావఁగా ప్రబలంబుఁ డనురాజు క్రోధముతో అట్టహాసుని ఎదురుకొని బాణవర్షములో ముంచెను. అట్టహాసుఁడు వానిసైన్యమును కొట్టి, వానిని మర్మ దేశములఁ గొట్టి, రథమందే కూల్చెను. ప్రలంబుఁడు పడుటం జూచి మోహనుఁ డనురాజు అట్టహాసుని పైకొని బాణప్రహారముల ముంచెను. అట్టహాసుఁడు వానికోదండము త్రెంపి సారథిని కొట్టి వానిని దృఢముగా ప్రహరించి కూల్చెను. ఇట్లు అట్టహాసుఁడు నలువురు శత్రువీరులను చంపఁగా చూచి శ్రుతశర్మబలము జయో