రథాదిప్రవిభాగము.
797
ఇంద్రవర్మ, శబకుఁడు క్రూరకర్మ, నిరాసకుఁడు,-ఈ రాజుసుతులు త్రిగుణరథులు. సుశర్మ, బాహుశాలి, విశాఖుఁడు, క్రోధనుఁడు, ప్రచండుఁడు, - అను నీరాజపుత్త్రులు చతుర్గుణ రథులు. జుంజరి, వీరవర్మ, ప్రవీరుఁడు, సుప్రతిజ్ఞుఁడు, అమర రాముఁడు, చండదత్తుఁడు, జాలికుఁడు, సింహభట వ్యాఘ్రభట శత్రుభటులు ముగ్గురును, - ఈరాజులును రాజపుత్త్రులును పంచగుణరథులు. ఉగ్రవర్మ యను నీరాజపుత్రుఁడు షడ్గుణ రథుఁడు. విశాఖుఁ డనురాజపుత్త్రుడు, సుతంతుఁడు, సుగముండు, నరేంద్రశర్మ,——అనువీరు సప్తగుణరథులు. సహస్రాయు వను నీరాజకుమారుఁడు మహారథుఁడు. శతానీకుఁడు మహారథ యూథపతి, సూర్యప్రభుని వయస్యు లయిన సుభాస హర్ష విమలులు, మహాబుద్ధి, అచలుడు, ప్రియకర శుభంకరులు, - అను వీరు మహారథులు యజ్ఞరుచి ధర్మరుచులును విశ్వరుచి భాస సిద్ధార్థులు ముగ్గురును సూర్యప్రభుని మంత్రులు మహారథ యూథపతులు ప్రహస్తుఁడు, మహార్థుడు, అనుమంత్రులు అతిరథయూథపతులు. ప్రజ్ఞాఢ్య స్థిరబుద్ధులు రథయూథపతులు. సర్వదమనుఁడు, ఈప్రమథణుఁడు, ధూమకేతువు, ప్రవహణుఁడు, వజ్రపంజరుఁడు, కాలచక్రుఁడు, మరుద్వేగుఁడు, వీరు రథాతి రథపతులు. ప్రకంపనుఁడు, సింహనాదుఁడును రథాతిరథ యూథపతులు. మహామాయుఁడు, కంబళికుఁడు, కాలకంపనకుఁడు, ప్రహృష్టరోముఁడు, అను నీనలువురు అసురాధిపతు