794
కథాసరిత్సాగరము. లం. 8. త. 3
అతఁడును తపస్సుచేసి యాచకులకు ప్రాణములను కూడ ఇచ్చువాఁడై ఇంద్రుని నూఱుమాఱులు జయించెను. పిమ్మట దేవతలు ఆలోచించుకొని అతనియొద్దకు పోయి 'మాకు పురుష మేథార్థము నీదేహము నిమ్ము' అని యాచించిరి. అతఁడు శత్రువులయినను వారికీ తనదేహము నిచ్చెను. ఉదారులు ప్రాణముల నయినను వదలుదురు గాని పరాఙ్ముఖులను గా యాచకులను వదలరు గదా. అంతట దేవతలు ప్రబలదానవుని ఖండఖండములుగా తెగ నఱికిరి. అతఁడు మరల ఇప్పుడు మనుష్యలోకములో ప్రభాస రూపమున అవతరించి యున్నాఁడు. ఇతఁడు మొదట నముచి, పిమ్మట ప్రబలుఁడు, ఇప్పుడు ప్రభాసుఁడు. ఆపుణ్యప్రభావముచేత శత్రువులకు అజయ్యుఁడు. ఈయోషధి గుహ ప్రబలునిది, కనుకనే అది యితనిది. కింకర సమేతముగా ఇతనికి వశ్య మై యున్నది. దాని క్రింద పాతాళమందు ప్రబలుని మందిర మున్నది. అందు ఇతని ముఖ్య భార్యలు స్వలంకృతలు పండ్రెండుగురు, వివిధరత్నములు, నానాయుధములు, చింతామణి, లక్షయోధులు, అన్ని గుఱ్ఱములతో ఉన్నారు. అది యంతయు ప్రభాసునిది పురార్జితము, ఈప్రభాసుఁడు అట్టివాఁడు. ఇతనియందు ఇది ఏమి యద్భుతము ? ఇట్లు మునికుమారునివలన విని సూర్యప్రభ ప్రభృతులు మయప్రభాస సమేతు లై రత్నాదులను తెచ్చుకొనుటకై తక్షణమే ప్రబల మందిరమునకు నడపున దైన బిలమార్గమునకు పోయిరి. ప్రభాసుఁడు ఒక్కఁడే ఆ