Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రుతశర్మకడకు దూత్యము.

785

డిట్లనియె:- 'ఈకల ఆయాసపూర్వక మయిన యభ్యుదయమును సూచించుచున్నది. ఆ జలప్రవాహమే యుద్ధము, మునుఁగక నీళ్లలో కొట్టుకొనిపోవుచుండియు నర్తించుచు ఉండుట యే ధైర్యము, దానిని మరలించిన వాయువు మీకు శరణ్యుఁడయిన యొకరక్షకుఁడు, మి మ్మెత్తిన జ్వలత్తేజుఁడు సాక్షాచ్ఛంకరుఁడు, అతఁడు మిమ్ము అగ్నిలో వేయుట యుద్ధములో ప్రవేశ పెట్టుట. అంతట మేఘోదయ మగుట మీకు మరల భయము కలుగుట, రక్తవర్షము భయవినాశనము దిక్కులు రక్తముతో నిండుట మీకు మహైశ్వర్యము. స్వప్నము నానావిధము, అన్యార్థము, యథార్థము, అపార్థము అని. ఏది వెంటనే అర్థమును సూచించునో అది ఆన్యార్ధము, ప్రసన్న దేవ తాదేశ రూపమైన స్వప్నము యథార్థము, గాఢానుభవచింతాదికృతమైన స్వప్నము అపార్థము. మనస్సు రజోమూఢము బాహ్యార్థ విముఖమును అగుడు నిద్రావశమున నున్న జంతువు నానాకారణములచే స్వప్నము కనును. అది కాలవిశేషమును బట్టి చిర ఫలమును శీఘ్రఫలమును సూచించును. రాత్ర్యంతదృష్ట మయిన యీస్వప్నము శీఘ్రఫలమును ఇచ్చును ' మునికుమారుఁడు ఇట్లు చెప్పఁగా సంతోషించి సూర్యప్రభాదులు లేచి దినకృత్యములను నిర్వర్తించిరి.

ఇంతలో ప్రహస్తుఁడు శ్రుతశర్మయొద్దనుండి మరలి వచ్చి మయాదులతో యథావృత్తము నిట్లు వర్ణించెను. “నేను