Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

784

కథాసరిత్సాగరము. లం. 8. త. 3

శ్రుతశర్మకడకు దూత్యము.

అంతట సునీథుఁడు సువాసకుమారుని స్మరించెను. అతండు వచ్చి మయాదులతోను రాజులతోను 'అయ్యా, విమానమును విద్యలను అన్నియు సూర్యప్రభునికి సిద్ధించినవి గదా. మీరు ఇప్పటికిని శత్రుజయవిషయమై యుదాసీసు లై యున్నా రేమి?' అనెను. అందులకు మయుఁడు 'మీరు చెప్పునది యుక్తము. ముందుగా దూతను పంపి, నీతిని ప్రయోగింతము గాక' అని పలికెను. 'అట్లే చేయ వచ్చును ఆక్షేప మేమి? ఈప్రహస్తుని పంపుఁడు. ఇతఁడు ప్రతిభావంతుఁడు, వాచాలుఁడు, గడుసువాఁడు, సహిష్ణువు, సర్వ దూత గుణాన్వితుడు.' అని మునికుమారుఁడు పలికెను. అందఱును ఆమాటకు సంతోషించి ప్రహస్తునికి సందేశము కఱపి శ్రుతశర్మకడకు పంపిరి. అతఁడు పోఁగానే సూర్యప్రభుఁడు వారందఱకు తాను కన్న కల యొకటి చెప్పెను: 'ఈరాత్రి వేకువజామున స్వప్నములో మనల నందఱను గొప్పజలప్రవాహము కొట్టుకొనిపోవు చుండెను. అందు మనము మునుఁగక నృత్యము చేయుచుంటిమి. అంత నాప్రవాహమును ఎదురుగాలి లేచి త్రిప్పివైచినది. ఆసమయములో జ్వలితతేజసుఁడు ఒక మహా పురుషుఁడు మనల నెత్తి నిప్పులో వైచెను; మనము కాల లేదు. ఇంతలో మేఘము వచ్చి నెత్తురు ప్రవాహమును వర్షించినది. ఆప్రవాహము దిక్కుల నన్నిటిని ముంచినది అంతలో నేను మేలుకొంటిని.' సువాసకుమారుఁ