Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

782

కథాసరిత్సాగరము. లం. 8. త. 3

ఆతఁడు దుర్జయుఁడు. దానిని అతఁడు నిశ్చయముగా ప్రధాన శత్రువ వయిన నీకొఱకు దాఁచి యున్నాడు. కనుకనే అతఁడు దానిని నీవయస్యులమీఁదికి ఇప్పుడు ప్రయోగింప లేదు. అది ఒకపర్యాయమే అతనికి ఫలించును, మరల మరల ఫలింపదు. అతఁడు పూర్వము దానిని తత్ప్రభావ పరీక్షార్థము ప్రయోగించెను. అంతట గురువు కోపించి అతనికి అట్లు శాపమిచ్చెను. ఈవిద్యలయొక్క ప్రభావము దురాసదము. అందులకారణము మహానుభావుని మయుని అడుగుము. ఈయన యెదుట నేనేమి చెప్పఁగలను? సూర్యునియెదుట దీపము ఎట్టిది ?'

మయుఁ డిట్లనియె - 'సత్యము చెప్పినాడు సుమేరువు. నేను సంగ్రహముగా చెప్పెద విను. అవ్యక్తమునుండి ఆ యా శక్త్యనుశక్తులు పుట్టును అందుండి ప్రాణశక్తి అనునాదము పుట్టి బిందుమార్గమును పొంది పరతత్త్వ కళాన్విత మయి విద్యాది మంత్రత్వమును పొందును. ఆమంత్రవిద్యలను ఎఱుఁగుటచే గాని తపస్సుచేఁగాని శిద్ధాజ్ఞచేఁగాని సిద్ధిపొందిన వారిమహిమ దురతిక్రమముగా నుండును. పుత్త్రా, నీకు అన్ని విద్యలు సిద్ధించినవి గాని రెండుమాత్రము లేవు. మోహినీ పరివర్తినీ విద్యలు నీకు తెలియవు. అవి యాజ్ఞవల్క్యునియొద్ద నున్నవి. ఆయనయొద్దకు పోయి వేఁడుము.'

అంతట సూర్యప్రభుఁడు ఆమహర్షియొద్దకు పోయెను. ఆయన అతనిని పాములమడుగులో ఏడుదినములు, అగ్ని