కశ్యపసందర్శనము.
769
కోపముచే మొగము లెఱ్ఱచేసికొనిరి. అంతట శాపభయముచే ఇంద్రుఁడు ఆయుధము సుపసంహరించి కూర్చుండెను.
సభార్యుని ఆసురాసురజనకుని కశ్యపమునిని పాదప్రణతుఁడై యింద్రుఁడు ప్రసన్నునిఁ జేసి కృతాంజలి యై యిట్లు విన్నపించుకొనెను --- 'స్వామి, నేను శ్రుతశర్మకు ఇచ్చిన విద్యాధరాధిరాజత్వమును హరించుటకు ఈ సూర్యప్రభుఁడు ఉద్యమించుచున్నాఁడు. సర్వప్రకారముల ఈమయుడు వానికై దానిని సాధింపఁ జూచుచున్నాఁడు. అందులకు భార్యాసహితుఁడై మహాముని 'మఘవుఁడా, శ్రుతశర్మ నీకు ఇష్టుఁడు, సూర్యప్రభుఁడు ఈశ్వరునికి ఇష్టుఁడు. అతనియిచ్ఛ తప్పదు. అతఁడే మయుని యత్నింపు మని యాజ్ఞాపించినాఁడు. ఈవిషయములో మయునియందు ఏమి యపరాధ మున్నదో నీవే చెప్పుము. ఇతఁడు ధర్మనిరతుఁడు, జ్ఞాన విజ్ఞాన సంపన్నుఁడు, గురుప్రణతుఁడు, వీనిని చెనకియుంటివేని మా క్రోధాగ్ని నిన్ను ఇప్పటికి భస్మీకరించియే యుండును. ఇతని మీఁదికి నీకు శక్తి లేదు, ఇతని ప్రభావమును ఎఱుఁగవా?' ఇట్లు ముని సభార్యుఁ డయి పలుకఁగా ఇంద్రుఁడు లజ్జా భయాన్వితుఁ డై తలవాంచి యుండెను. అంతట ఆశ్రుతశర్మ ఎట్టివాఁడో తెచ్చి చూపు మని అదితి యడిగెను. వెంటనే శక్రుఁడు మాతలిని పంపి శ్రుతశర్మను రప్పించెను. వినతుఁ డయిన యతనిని, సూర్యప్రభుని, చూచి, కశ్యపుని ఆయిరువురలో ఎవఁడు రూపలక్షణాధికుఁడో