Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూర్యప్రభుఁడు ప్రహ్లాదుని దర్శించుట.

751

యీమెతండ్రి దండనార్థము ఈమెను నీకు ఇయ్య నిశ్చయించుకొని యున్నాఁడు. అట్టిచో నిన్ను ఇచట అడ్డగించువాఁ డెవఁడు? ఈమె దొంగతనమునకు తగిన దండన ఏల చేయవు?' అంతట సూర్యప్రభుఁడు కవుంగిలించుకొనఁబోఁగా లజ్జిత యై 'వలదు ఆర్యపుత్త్రా, వలదు ; కన్యను గదా నేను.' అని కళావతి పలికెను. అంతట ప్రహస్తుఁడు 'దేవీ, నీకు సందేహము అక్కఱలేదు, సకల వివాహములలోను శ్రేష్ఠమైన గాంధర్వవివాహము సుమా యిది.' అని వాకొని, ఇత రానుచరుల నందఱను తోకొని, వెడలి పోయెను. వెంటనే సూర్యప్రభుఁడు కళావతిని భార్యను చేసికొని ఆమెతో అతర్కితోపనత మయి మర్త్య దుర్లభ మైన నవసంభోగమును పొందెను. తెల్లవాఱుజామున కళావతి నిజనివాసమున కేఁగెను.

సూర్యప్రభుఁడు ప్రహ్లాదుని దర్శించుట.

సూర్యప్రభుఁడు సునీథమయాసురులకడకు పోయెను. వా రందఱు గూడి ప్రహ్లాదునియొద్దకు పోయిరి. అతఁడు వారిని యథార్హముగా సమ్మానించి మయునితో 'సునీథుని యీ యభ్యుదయమందు మన మందఱము ఉత్సవము చేయవలసినది, కనుక ఈదినము మన మందఱము ఒక్కచోటనే భుజింతము.' అనెను. 'అట్లే చేయుదము దోష మేమి?' అని మయుఁడు పలుకఁగా ప్రహ్లాదుఁడు దూతలను పంపి అసురాధిపతులను రప్పించెను. అందఱును ఎల్లపాతాళములనుండి