సునీథుఁడు బలిని దర్శించుట.
747
అతఁడు పోఁగానే శుక్రాచార్యుఁడు దానవేంద్రులతో నిట్లనియె:— ' ఈవిషయములో ఇంద్రుఁడు బద్ధద్వేషుఁడు. మనకు మహేశ్వరుఁడు సుప్రసన్నుఁ డై యుండఁగా ఇంద్రుఁడేమి చేయఁగలఁడు? అతని విష్ణుభక్తివలన ఏమి ప్రయోజనము?' ఇట్లు గురువు పలుక దానవులు అంగీకరించి బలిప్రహ్లాదుల వలన సెల వొంది నిజాలయముల కరిగిరి. పిమ్మట ప్రహ్లాదుఁడు తన నివాస మైన నాలవపాతాళమునకు పోఁగా, బలియు కొలువు వదలి లోనగరికి పోయెను మయుఁడును సునీథ సూర్యప్రభులును బలికి నమస్కరించి తమ నివాసములకు పోయిరి.
అచట భోజనపానము లైన పిమ్మట తల్లి లీలావతి సునీథునితో 'పుత్త్రా, ఈ నీభార్యలు గొప్పవారి కొమారితలు, ఎఱుఁగుదువు గదా; తేజస్వతి ధనేశునికూఁతురు, మంగలావతి తుంబురుని కూఁతురు, చంద్రప్రభశరీరములో నీవు వివాహమాడిన కీర్తిమతి ప్రభాసుఁ డను వసువుకూఁతురు, ఈముగ్గురను నీవు సమదృష్టితో చూచుకొనుచుండ వలయును.' అని చెప్పి ఆముఖ్యభార్యలను మువ్వురసు అతనికి సమర్పించెను. ఆ రాత్రి సునీథుఁడు పెద్దభార్య యైన తేజస్వతితోడ శయన మంగీకరించెను. అచట చిరోత్సుక యయిన యామెతో భుక్తపూర్వము లయినను నూతనములఁ బోలె నానాక్రీడలను అనుభవించెను. సూర్యప్రభుఁడు మఱియొక పడుకయింట మంత్రులతోఁగూడ ఆ రాత్రి భార్య లేక శయనించి యుండెను. 'స్నేహ