Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

744

కథాసరిత్సాగరము. లం. 8. త. 2

ఈ సూర్యప్రభుఁడు నీ రెండవ కుమారుఁడు సుముండీకుఁడు. ఇతఁడు నీపుత్త్రునికి ఈసునీథునికి పుత్త్రుఁడుగా జన్మించినాఁడు. ఇతఁడు విద్యాధరులకు ఈ దేహముతోనే చక్రవర్తి యగు నని రుద్రుఁడు నియమించి యున్నాఁడు.' అని మయుఁడు చెప్పెను. ఆమాట విని ఉత్సుకదృష్టులతో చూచుచున్న తల్లి పాదముల సూర్యప్రభుఁడు మంత్రులతోఁగూడవ్రాలెను. 'పుత్త్రా,సుముండీక దేహ మేల? ఇదే బాగుగా నున్నది.' అని లీలావతి దీవించెను.

ఆ పుత్త్రాభ్యుదయ సమయములో మయుఁడు తన కూఁతురు మందోదరిని విభీషణుని స్మరింపఁగా వారును వచ్చిరి. విభీషణుఁడు వచ్చి సత్కారము పొంది ' దానవేంద్రా, నా మాట చేయుదువేని, నే నొకటి చెప్పెదను. దానవులలో నీ వొకఁడవే సుకృతివి, శుభజీవితుఁడవు, నీవు నిష్కారణముగా దేవతలతో ద్వేషింపఁ గూడదు. వారితో ద్వేషించుటవలన మీకు అపాయమేగాని గుణ మేమియు లేదు. యుద్ధములో దేవతలచే అసురులు మడిసిరిగాని, అసురులచేత సురలు నశింప లేదు.' అనెను. 'మేము బలాత్కారముగా ఏమియు చేయము. ఇంద్రుఁడు హఠమునం జేయు చుండఁగా ఎట్లు సహింతుము ? చెప్పుము దేవతలచేఁ గూలిన యసురులు ప్రమత్తులుగా నుండిరి. అప్రమత్తు లయిన బలి ప్రభృతు లే మయిన హతు లయిరా?' అని మయుఁడు పలికెను. అంతట విభీషణుఁడు మందోదరిని తోడ్కొని తన నివాసమునకుఁ బోయెను.