కాలుఁడను విప్రుని కథ.
741
ఇతఁడు మొదట పుచ్చుకొని ఆగోవును ఇచ్చినవానికే మరల ఏల యీయ వలయును ?' అనియెను. ఆసందర్భము గొని ఇంద్రుఁడు రాజుతో 'రాజా, ఇంత యెఱుఁగుదు వేని, న్యాయ్యముగా జాపకునివలన వరము వేఁడి ఏల నీవు పుచ్చుకొనవు ?' అనెను. అంతట ఉత్తర మేమియు చెప్ప లేక రాజు బ్రాహ్మణునితో 'బ్రాహ్మణోత్తమా, నీజపములో సగము ఫలము నా కిమ్ము ఇదే నావరము.' అనెను. 'సరియే, నాజపములో సగము ఫలము నీకు కలుగును గాక.' అని జాపకుఁడు వర మిచ్చెను. అందువలన ఆరాజు సర్వలోకగమనము పొందెను. జాపకుఁడును శివ మను పేరి దేవలోకగమనము పొందెను. అచట అనేక కల్పములు ఉండి మరల భూతలమునకు వచ్చి యోగమువలన స్వాతంత్య్రమును పొంది శాశ్వతసిద్ధిని పొందెను. ఇట్లు పెద్దలు స్వరాదిభోగములను లక్ష్యపెట్టక సిద్ధినే కోరుదురు. దానిని నీవు పొందితివి, స్వతంత్రుఁడ వై నీదేహములో ప్రవేశింపుము.-
ఇట్లు మయుఁడు యోగవిద్య నిచ్చి పలుకఁగా చంద్రప్రభుఁడు భార్యా తనయ మంత్రులతోఁ గూడ మిగుల సంతోషించెను పిమ్మట మయుఁడు, రాజును పుత్త్రాదులతోఁ గూడ రెండవ పాతాళమునకుఁ గొనిపోయెను. అచట వా రందఱు గొప్ప యోషధులతోను నేతితోను అభ్యక్తుఁడై వికృతాకృతిచే భయంకరుఁ డై విషణ్ణవదనాంభోజ లైన దైత్యరాజకన్యలచే ఆవృతుఁ డై యున్న యొక మహాపురుషుని మహార్హశయన