Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

738

కథాసరిత్సాగరము. లం. 8. త. 2

ఈలోపల అందఱతోను పాతాళములో దేవాలయములో నున్న చంద్రప్రభునితో మయుఁడు:- 'రాజా, ఏకాగ్రచిత్తుఁడ వై వినుము. నీ కిపుడు పరకాయప్రవేశయోగమును ఉపదేశించెదను.' అని హెచ్చరించి యోగమును సాంఖ్యమును రహస్యములతోఁ గూడ నేర్పి దేహాంతర ప్రవేశయోగమును గూడ ఉపదేశించి యిట్లనియె: - ఇదే ఆ సిద్ధి. అణిమాద్యైశ్వర్యములకు కారణ మయినజ్ఞానమును స్వాతంత్ర్యమును ఇదే. ఈ యైశ్వర్యమం దున్న వా రై సురేశ్వరులు మోక్షమును గూడ అపేక్షింపరు. ఇతరులు మహానుభావులు దీనికొఱకే జప తపములు చేయుదురు, లభించిన స్వర్గభోగములను కూడ అంగీకరింపరు. ఇందులకు నిదర్శనము వినుము. -

కాలుఁడను విప్రుని కథ.

పురాకల్పమున కాలుఁ డని ఒక బ్రాహ్మణుఁ డుండెను. అతఁడు పుష్కరద్వీపమునకుఁ బోయి దివానిశము జపము చేయుచుండెను. ఆరీతిని రెండువందల దివ్యవర్షములు గడచెను. అంత అతనిశిరస్సునుండి అవిచ్ఛిన్నముగా మహాజ్వాల యొకటి పుట్టెను. వెలు వడిన యాజ్వాలచేత ఆకాశములో సూర్యాదులగతి నిలిచి పోయినది, మూఁడు లోకములును మండిపోయినవి. బ్రహ్మాదిదేవతలు అతనియొద్దకు వచ్చి 'బ్రాహ్మణా, నీకు కావలసిన వరమును అడుగుము, నీతేజస్సుచేత లోకములు మండి పోవుచున్నవి.' అని యడిగిరి. 'నాకు జపము