దమయంతి కథ.
1003
ఆవృత్తాంతమును నివేదించెను. 'ఓయి సత్యవాదీ, మేము నీకు వశ్యులము, నీవు తలఁచిన మాత్రాన మేము వచ్చెదము.' అని పలికి దేవతలు దమయంతిని వరించువారై నలరూపము దాల్చి మనుష్యధర్మము నవలంబించి స్వయంవర మందిరములో నలుని చెంతఁ గూర్చుండిరి.
అంత దమయంతి వచ్చి, క్రమముగా భ్రాత ఒక్కొక్క రాజును తెలుపు చుండఁగా ఎక్కడను మనస్సును నిలుపక నలునిచోటికి వచ్చినదై, భ్రాత నలరూపులను ఛాయానిమేషాది చిహ్నులను ఆఱుగురను కని చింతించుచుండఁగా, వ్యాకులిత హృదయ యై 'నిశ్చయముగా లోకపాలురు ఏవురును నన్ను వంచించుటకు ఈ మాయ పన్నినారు. ఆఱవవాఁడు నలుఁడు, నాకు నలుఁడు తప్ప మఱియొకఁడు వరుఁడు గాఁడు.'అని తలంచి, నలై కాయత్త మానస యై, దేవతల వైపు తిరిగి యీ రీతిని విన్న వించెను:- 'ఓలోకపాలకులారా, స్వప్నమం దైనను నామనస్సు నలుని తప్ప మఱియొకనిపై నుండదేని, నాయందు కరుణించి ఆ సత్యముచే మీ నిజరూపములను దాల్పుఁడు. ముందు వరింపఁబడిన వరునికంటె ఇతరు లందఱును కన్యకు పర పురుషులు, వారికి ఆమెయు పరభార్య. ఇట్లుండఁగా మీకు ఈ యజ్ఞాన మెట్లు గలిగినది! ఆమాటవిని ఇంద్రాది దేవతలు ఏవురును నిజరూపములు దాల్చిరి. నలమహారాజు మాత్రము ఏక రూపముననే యుండెను. దమయంతి సంతసించి, అతనియందు