Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

990

కథాసరిత్సాగరము. లం. 9. త. 6

నీలోత్పలమును చేతఁగొని సంతోషముతో పిల్లవానిముక్కునఁ బెట్టెను. ఆ గంధముచే మహీపాలుఁడు నిర్విషుఁ డై నిద్రనుండియుంబోలె లేచెను నగరమందు సకలజనులును రాజును ఉత్సవము చేసిరి. చంద్రస్వామిని ఇతఁ డెవరో దేవాంశుఁడు మహానుభావుఁ డని అనంతస్వామియు, పౌరులును, రాజును, బహుధనము లిచ్చి పూజించిరి.

చంద్రస్వామి సత్కృతుఁ డై మంత్రియింటనే కుమారుని మహీపాలుని కొమరితను చంద్రవతిని చూచుచు ఉండెను. వారు ఒండొరువుల నెఱింగియు బయటఁ బెట్టరైరి. కార్యపరులగు బుద్ధిమంతులు అకాలమందు రహస్యమును వెల్లడి చేయుదురా? పిమ్మట మహీపాలునికి అపుత్త్రుఁ డైన తారవర్మమహారాజు గుణాకృష్టుఁ డై బంధుమతి యను తన కన్య నిచ్చి వివాహము చేసి, యర్ధరాజ్య మిచ్చి, క్రమముగా సకల రాజ్యమును ఇచ్చి, సుఖముగానుండెను. మహీపాలుఁడుతనకు రాజ్యము రాఁగానే, చంద్రస్వామి తన తండ్రి యని ప్రకటించి, చెల్లెలిని తగినవరుని కిచ్చి వివాహము చేసి, సుఖముగా రాజ్యము చేయు చుండెను. ఒకనాఁడు చంద్రస్వామి యదృచ్ఛగా 'నాయనా, రమ్ము, స్వదేశమునకు పోయి నీ తల్లిని కొనివత్తము. నీవు రాజ వైతివని యెఱిఁగి ఆమె తన్ను మఱచితి వని కోపించి దుఃఖముచే ఒకవేళ శపించినను శపించును. తల్లిదండ్రులచే శప్తుఁ డగువానికి