736
కథాసరిత్సాగరము. లం. 8. త. 2
దువు. సూర్యప్రభుఁడు ఈ సుందరాంగముతోనే విద్యాధరేశ్వరుఁ డగునుగాక.' ఇట్లు మయుఁడు పలుకఁగా చంద్రప్రభుఁడు సంతోషించి అంగీకరించెను.
ఆ సమయమందు సిద్ధార్థకుఁడు ఇట్లు అడిగెను. 'వేఱు దేహము చొచ్చినవాఁడు చచ్చినవాఁడే, ఈ మార్పు వలన మా కేమి సంతోషము ? మఱియు ఇతఁడు దేహాంతరప్రవిష్టుఁ డై పరలోకగతునివలెనే మమ్ము మఱచును. అంతట ఇతఁ డెవరో మే మెవరమో ? ' మయుఁ డిట్లనియె: ' యోగమహిమచే స్వతంత్రుఁ డై పరకాయప్రవేశము చేయు నితనిని మీరు కూడ వచ్చి చూడుఁడు. ఆదేహము చేరియు ఇతండు మిమ్ములను మఱవఁడు. కారణము వినుఁడు. అస్వతంత్రుఁ డై చచ్చి గర్భములో పుట్టినవాఁడు మరణాదిక్లేశములచే స్మృతి పోయి ఏమియు జ్ఞ ప్తియుంచుకొనఁ జాలఁడు. స్వాతంత్ర్యముచే వేఱుదేహములో యోగయుక్తిచే అంతఃకరణముతోను ఇంద్రియములతోను చొచ్చు జ్ఞాని యోగేశ్వరుఁడు, మనోబుద్ధులు చెడక, యింటినుండి యింటికి పోవువాఁడు వోలె, సకలమును స్మరించును. కనుక మీకు సందేహము వలదు. ఈరాజు ఇందువలన జరారోగవివర్జిత మైన దివ్యదేహమును పొందును. మీ రందఱును దానవులే. రసాతలము చొచ్చి అమృతము త్రాగి రోగరహిత మయిన దివ్యదేహములు పొందుఁడు ' మయుని యీమాట అందఱు నమ్మి శంక మాని యుండిరి.