Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రప్రభుఁడు సునీథదేహముం జొచ్చుట.

735

సత్కృతుఁ డై యి ట్లనియె: - 'నా ముఖముగా సాంబమూర్తి స్వయముగా చెప్పుచున్నాఁడు. నీకు నూఱుగురు ఇంద్రులు ఎత్తివచ్చినను భయము అక్కఱలేదు. సూర్యప్రభుఁడు విద్యాధరులకు చక్రవర్తి కానే అగును.' ఇట్లు శంకరాజ్ఞను నివేదించి తనబలిభాగమును గ్రహించి నందీశ్వరుఁడు భూతగణములతోఁగూడ అంతర్ధానము పొందెను. పిమ్మట చంద్రప్రభుఁడు కుమారునియభ్యుదయమున నమ్మకము గలవాఁ డై బలిని ముగించి మయాసురునితోఁ గూడ నగరమునకు పోయెను.

చంద్రప్రభుఁడు సునీథదేహముం జొచ్చుట.

మఱునాఁడు ఉదయమున కుమారునితోను దేవితోను మంత్రులతోను సుఖాసీనుఁ డై యున్న చంద్రప్రభభూపతితో మయుఁ డి ట్లనియె :— 'రాజా, చిరరక్షిత మయిన రహస్య మొకటి చెప్పెదను. నీవు సునీథుఁ డను దానవుఁడవు, నా కుమారుఁడవు, మహాబలుండవు. సూర్యప్రభుఁడు సుముండీకుఁడు నీతమ్ముఁడు. మీర లిరువురును దేవతలతోడికయ్యములో మడిసి ఇచట తండ్రికొడుకు లై పుట్టితిరి. నీదానవశరీరమునకు ఘృతాదులను ఓషధులను శాస్త్రోక్త యోగ ప్రకారము పూసి దాఁచి రక్షించి యున్నాను. కనుక బిలప్రవేశముచేసి పాతాళమునకు పోయి నీసొంతదేహములో నా చెప్పెడి యుక్తిచేత ప్రవేశింపుము. అందులో చొరఁగానే తేజోవీర్య బలాధికుఁడ వై దేవతలను యుద్ధములో జయించువాఁడ వగు