Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కనకవర్షుని కథ.

971

రామాయణపాఠకునివలన పుత్త్రార్థ మై ప్రయాసపడిన దశరథమహారాజు కథను ఆలించెను.

అంతట రాజు తనకు పుత్త్రప్రాప్తి చింత గలుగుడు, క్షపణుఁడును పోవుడు, ఆదినమును విమనస్కుఁ డై గడపెను. రాత్రి నిద్ర పట్టక ఏకాకియై శయనగతుఁ డై యుండఁగా ఒక స్త్రీ తలుపు తెఱవకయే లోపలికి ప్రవేశించెను. రాజు ఆశ్చర్యపడి లేచి వినీతుఁడై ప్రణమిల్లఁగా ఆమె ఆశీర్వదించి యిట్లనియె:- పుత్త్రా, నేను నాగరాజు వాసుకి కొమరితను, నీ తండ్రికి అక్కను నాపేరు రత్నప్రభ. నిన్ను రక్షించుటకు ఎప్పుడును నీ యొద్ద అదృశ్యురాల నయి వసించుచున్నాను. ఈదినము నీవు మిగుల చింతాక్రాంతుఁడ వై యుండుటంబట్టి నీకు అగపడితిని. నీదుఃఖమును నేను చూడ నొల్లను.' అత్త యిట్లు పలుకఁగా రా జనియె:— ' అత్తా, ఈ నీప్రసాదముచేత నేను కృతార్థుఁడను, నా దుఃఖమునకు పుత్త్రుఁడు లేమియే కారణము. దశరథాది రాజర్షులు కూడ పూర్వము స్వర్గార్థము పుత్త్రుని కోరిరి, నాబోంట్లు కోరరా?' ఆమాటకు రత్నప్రభ అల్లునితో 'అట్లయిన, పుత్త్రా, ఇందులకు ఉపాయము చెప్పెదను, దానిని చేయుము. కుమారస్వామి కడకు పోయి తపస్సు చేయుము. నీ తలమీఁద కుమారుని థార దుస్సహముగా పడును. దానిని నీ దేహమందు ప్రవేశించియున్న నాప్రభావముచేత ఓర్తువు. ఇతర విఘ్నములను కూడ జయించి అభీష్టసిద్ధిని పొందుదువు.' అని