చిరదాతృప్రసంగుల కథ.
959
ఈ మరుభూతిని, రెండువత్సరములు కొలిచితిని, ఇతఁడు నాకును నాభార్యకును అన్న పానములు మాత్ర మిచ్చినాఁడు. మొదట ఇతఁడు నాకు సంవత్సరమునకు ఏఁబది దీనారములు జీతము ఇచ్చునట్లు మాట లాడినాఁడు. వానిని మాత్రము ఈయఁడు. నేను పోయి ఇమ్మని అడుగఁగా నన్ను తన్ని పంపినాఁడు. అందుచేత నేను తమ సింహద్వారములో ప్రాయోపవేశము చేసి యున్నాను. ఏలినవారు విచారింపరేని నేను అగ్నిప్రవేశము చేసెదను, ఇఁక నేమి చెప్పుకొందును?' అని విన్నవించుకొనెను. అంత మరుభూతి 'దేవా, వీనికి దీనారములు ఇయ్య వలయు ననుట వాస్తవమే, అయినను ఇప్పుడు నాయొద్ద లేవు. ' అనిపలికెను. అందఱు నవ్విరి. అంత నరవాహనదత్తుఁడు అతనితో 'ఏమినీకు ఈ మూర్ఖబుద్ధి? తత్క్షణము లేచిపోయి వానికి దీనారములు ఇచ్చి వేయుము.' అనియె. అతఁడు లజ్జితుఁ డై వెంటనే తెప్పించి వానికి నూఱు దీనారములు ఇచ్చెను. గోముఖుఁడు ఆసమయమున 'దేవా, మరుభూతిని అనఁగూడదు. బ్రహ్మసృష్టి నానాచిత్రములుగా నున్నది! చిరదాత యను రాజు యొక్కయు అతని సేవకుఁడు ప్రసంగుఁడను వానియొక్కయు కథను చెప్పెదను వినుము.' అని యిట్లు చెప్పదొడంగెను.
చిరదాతృప్రసంగులకథ.
పూర్వము చిరపుర మను నగరమున చిరదాత యను రాజు ఏలు చుండెను. అతఁడు సుజనుఁ డైనను అతని పరివార