చమరవాల మహారాజుకథ.
951
చమరవాల మహారాజుకథ.
హస్తినాపుర మని నగరము కలదు. అందు కోశదుర్గ బలాన్వితుఁడు చమరవాలుఁ డను రాజు ఏలుచుండెను. దాయాదులు సమరబలాదులు ఏవురు అన్ని ప్రక్కలను రాజులుగా నుండిరి. వారు ఒకప్పుడు 'ఈ చమరవాలుండు మనలను ఒక్కొక్కరినిగా సదా భాధించుచున్నాఁడు. మన మందఱము కలిసి వీనిని కొట్టుదము.' అని కలియఁ బలికికొని అతనిపై దండెత్తుటకై జోస్యుని మంచిలగ్నము పెట్టు మనిరి. అతఁడు శుభలగ్నము కానక అశకునములు చూచి 'మీకు సంవత్సరములోపల లగ్నము లేదు. లగ్న శుద్ధి లేకయే వెడలుదురేని మీకు జయము కలుగదు. అతని యైశ్వర్యమును చూచిన మాత్రాన మీకు ఈ వృథాభినివేశ మేల? లక్ష్మికి భోగముఫలము; అది వానికంటె మీకే అధికముగా నున్నది. ఇందులకు ఇద్దఱు వర్తకుల కథను చెప్పెదను వినుఁడు.' అని యిట్లు చెప్పఁ దొడగెను.
అర్థవర్మ భోగవర్మల కథ.
కౌతుకపుర మనెడు నగరములో బహుసువర్ణకుఁ డని అన్వర్థ నామధేయుఁడు రాజు ఉండెను. అతనికి క్షత్త్రియుఁడు పడుచువాఁడు యశోవర్మ యని యొక సేవకుఁడు ఉండెను. దాత యయ్యును ఆ ప్రభువు ఆ సేవకునికి మాత్రము ఎప్పుడును