944
కథాసరిత్సాగరము. లం. 9. త. 4
తోలుము.' అని, అతఁడును సరియే యనఁగా, అచ్చరలతో రథ మెక్కి గోముఖాదు లున్న చోటికిఁ బోయి, వారిని చూచి వారితో 'మీరు మీమార్గమున త్వరితముగా ఇంటికి రండి, అచట అంతయు చెప్పెదను.' అని పలికి, తాను ఆకాశమునఁ బోయి స్వనగరము చేరి మాతలిని సత్కరించి వీడ్కొలిపి, ఆయచ్చరలతో తన నగరు చొచ్చెను. ఆచ్చరలను అంతఃపురమున నిలిపి తాను పోయి తండ్రిపాదములకును తల్లికి వాసవ దత్తకును, తల్లికి పద్మావతికిని ప్రణమిల్లెను. వారు తనివి తీఱక చూచుచు సంతోషించిరి. ఇంతలో రథారూఢుఁ డై ససారథి యై గోముఖుఁడు ప్రలంబబాహువుతోఁ గూడ వచ్చెను. అంతట తండ్రి యడుగఁగా నరవాహనదత్తుఁడు మంత్రి వర్గము నెదుట తన యద్భుత వృత్తాంతమును వక్కాణించెను. 'ఈశ్వరుఁడు ఏ పుణ్యాత్మునికి అనుగ్రహము చేయఁ గోరునో వానికి కల్యాణ మిత్త సంయోగమును ఇచ్చును.' అని యందఱును పలుకుచుండఁగా రాజు సంతోషించి కుమారునిపై హర్యనుగ్రహము కలిగినందులకు మహోత్సవము చేసెను. గోముఖుఁడు తెచ్చి తనకును తన భార్యలకును పాదప్రణామము చేయించిన యా యచ్చరకోడండ్రను హరిప్రసాదలబ్ధలను చూచి రాజు సంతోషించి, దేవరతి దేవరూప దేవమాల దేవప్రియ యని వారి నామములు చేటికలవలన నెఱిఁగెను. ఆకౌశాంబీనగరి 'నే నెక్కడ, నాయందు అప్సరస లెక్కడ? నరవాహన