Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

940

కథాసరిత్సాగరము. లం. 9. త. 4

ఇష్టమేని ఆకాశమార్గమునఁ గొని పోయెదము.' ఇట్టు అదేవపుత్త్రులు పలుకఁగా వల్లె యని నరవాహనదత్తుఁడు సులభ జలఫలాధిక మయిన యా సరస్తీరమందు గోముఖాదులను నిలిపి, దేవసిద్ధియొడిలో కూర్చుండి, ఆకాశమార్గమునఁ బోయి, దూరముననుండియే దిగెను. ప్రక్కను జలధికన్యయు పాదాంతమందు భూదేవియుఁ గొలుచుచుండఁగా సవిగ్రహములయిన శంఖ చక్ర గదా పద్మములు సేవించుచుండఁగా, నారదాది మహర్షులును గంధర్వులును స్తుతులు పాడుచుండఁగా, సిద్ధ విద్యాధరులు తెలచుచుండఁగా, గరుడుఁడు ఎదుట కూర్చుండఁగా, శేషశాయియై వెలుగొందుచున్న శ్రీమహావిష్ణువును ఆనలువురు దేవపుత్త్రులతో దర్శించెను. సాధుసమాగమము ఎవరికి అభ్యుదయమును ఈయదు! దేవపుత్త్రులు హరిని అర్చించిరి, కశ్యపాదులు స్తుతించిరి. నరవాహన దత్తుఁడును కేలు మోడ్చి హరిని ఇట్లు పొగడెను.

'దేవా లక్ష్మీ కల్పల తాలింగిత దేహ మయిన భక్తకల్ప మహీరుహమా అభీష్టదాయీ నీకు నమస్కారము. సన్మానస వాసి దివ్యహంసా సతతోదితనాదా పరాకాశవిహారి నమస్కారము. సర్వాతిశాయీ సర్వాంతర్యామి త్రిగుణాతీతరూపా పూర్ణ షాడ్గుణ్యమూర్తీ నీకు నమస్కారము. స్వాధ్యాయోద్య న్మృదుధ్వని యై ఉద్భూత బహుచరణుఁ డయ్యును బ్రహ్మ నీ నాభికమలములో షట్చరణాయమానుఁడుగా నున్నాఁడు. నీకు