Jump to content

పుట:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీహరి నలువు రచ్చరల నిచ్చుట.

939

అనుచురులును స్నాతపీతు లయిన పిమ్మట, ఆసరస్సులో నొకచోట దూరమున నలువురు పురుషులను చూచెను.

శ్రీహరి నలువు రచ్చరల నిచ్చుట.

దివ్యాకృతులు దివ్యవస్త్రులు దివ్యాభరణ భూషితులు నయిన యాపురుషులు సరస్సునుండి బంగారుతామరలను కోసికొను చుండిరి. నరవాహనదత్తుఁడు కౌతుకముచే వారిని దఱిసి, వారు నీ వెవర వని యడుగఁగా తనపేరును వంశమును చెప్పెను. వారును అతని దర్శనముచే సంతసిల్లి అతఁ డడుగఁగా ఇట్లనిరి: “మహాసముద్రమునకు నడుమ నారికేళద్వీప మని యొక ద్వీపము కలదు; అందు నాలుగు పర్వతములు దివ్యభూములు మైనాకము వృషభము చక్రము బలాకము అనునవి కలవు. అందు మేము నలువురము నివసింతుము. మాలో ఒకఁడు రూపసిద్ధి యనువాఁడు నానారూపములు దాల్చును. ఒకఁడు ప్రమాణసిద్ధి గొప్పప్రమాణములను చిన్నప్రమాణములను చూచును. జ్ఞానసిద్ధి మూఁడవవాఁడు త్రైకాల్యజ్ఞానము కలవాఁడు. నాలవవాఁడు దేవసిద్ధి సకలదైవత సిద్ధికలవాఁడు. మేము ఈ బంగారుకమలములను చేకొని శ్వేతద్వీపములో శ్రీపతిని పూజించుటకు పోవుచున్నాము. మేము అందఱము శ్రీపతి భక్తులము కదా. ఆయన ప్రసాదముచేతనే గదా మాకు ఆ పర్వతములయందు ఆధిపత్యము సిద్ధులు సంపదలును కలిగి యున్నవి. నీవును రమ్ము, శ్వేతద్వీపములో హరిని చూపెదము. నీకు